జైల్లో ఉండడం కోసం స్టేషన్​ కు నిప్పుపెట్టిన యువకుడు

0 9,665

గుజరాత్ ముచ్చట్లు :

 

23 ఏళ్ల యువకుడు భార్య వేధింపులు భరించడం కన్నా.. జైలులో ఉండడం మేలు అనుకున్నాడు. పెట్రోల్, అగ్గిపెట్టె పట్టుకుని నేరుగా దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. స్టేషన్ కు నిప్పు పెట్టేశాడు. పారిపోకుండా అక్కడే నిలబడ్డాడు. ఈ ఘటన గుజరాత్ లోని రాజ్ కోట్ లోని రాజీవ్ నగర్ లో జరిగింది. పోలీసులు నిందితుడు దేవ్ జీ చావ్దాను అరెస్ట్ చేశారు. అదృష్టవశాత్తూ స్టేషన్ లో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఎందుకిలా చేశావంటూ దేవ్ జీని పోలీసులు ప్రశ్నించగా ‘‘ఇంట్లో నా భార్య వేధింపులు భరించలేకపోతున్నా. తిండి కూడా పెట్టట్లేదు. దానికన్నా జైలే నయమనిపించింది. రోజూ తిండి పెడతారు. చేసుకోవడానికి పనిస్తారు. అందుకే జైలుకెళ్దామనుకుని ఆలోచించి.. స్టేషన్ కు నిప్పుపెట్టా’’ అంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:The young man who set fire to the station for being in jail

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page