అర్హులందరికి సంక్షేమ పథకాలు- సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

0 8,861

రామసముద్రం  ముచ్చట్లు:

అర్హులందరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక కెసిపల్లి పంచాయతి పరిధిలో నూతనంగా మంజూరైన వైఎస్సార్ గృహనిర్మాణ దశలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా గ్రామ సచివాలయం ద్వారా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి గ్రామాలలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిస్కారమయ్యే విధంగా సచివాలయాలు వేదికలయ్యాయని అన్నారు. అంతే కాకుండా గూడులేని నిరుపేదలందరికి ఇల్లు మంజూరు చేయాలన్న దృడసంకల్పంతో వైఎస్సార్ గృహనిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతిఒక్కరికి నూతనంగా గృహాలు మంజూరు అవుతున్నట్లు తెలిపారు. మంజూరైన గృహాలను లబ్ధిదారులు వేగవంతంగా నిర్మించు కోవాలని సూచించారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధన ప్రకారం మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను చేపట్టాలని కోరారు. ఇంటి నిర్మాణ దశను బట్టి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తున్నట్లు ఆయన పేర్కున్నారు. అంతే కాకుండా ఇంటికి కావలసిన నిర్మాణ సామాగ్రి కూడా ప్రభుత్వమే ఇచ్చే విదంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు అనంతరం వై.కురప్పల్లి, గుంతయంబాడి, వనగానిపల్లి, జోగిండ్లు, మిట్టయంబాడి గ్రామాలలో నిర్మిస్తున్న గృహాలను ఆయన పరిశీలించి పలురకాల సూచనలు లబ్ధిదారులకు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, ఇంజనీర్ అసిస్టెంట్ మూర్తి, స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, జయచంద్ర, నాగరాజ, వెంకటరమణ, రెడ్డెప్పరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వాలంటర్ లు మేఘన, శ్రావణి, పుష్పావతి, దినకర్, వెంకటరమణ, కుమారస్వామి పాల్గొన్నారు.

- Advertisement -

 

 

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Welfare Schemes for All Eligible – Sarpanch Srinivasureddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page