సీనియర్ నటుడు ‘కాకరాల’ కు సిపిఎం నేత కందారపు మురళి పరామర్శ

0 9,904

తిరుపతి ముచ్చట్లు:

- Advertisement -

సీనియర్ సినీ నటుడు, వామపక్ష వాది, మార్క్సిస్టు దృక్పథం ఉన్న ‘కాకరాల’ ను సిపిఎం నేత కందారపు మురళి బుధవారం నాడు కలిసి పరామర్శించారు. స్థానిక పాత మెటర్నిటీ రోడ్డులోని సమత హాస్పిటల్ అధినేత, ప్రముఖ ఆక్యుపంక్చర్ వైద్యులు డాక్టర్ బాలాజీ కి చెందిన ఆసుపత్రిలో కాకరాల గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. 84 ఏళ్ల వయోభారం ఉన్న కాకరాల 250 కి పైగా చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, అక్కినేని, శోభన్ బాబు, కృష్ణ లాంటి సీనియర్ నటులతో అనేక చిత్రాల్లో నటించారు. ఇటీవల కాకరాల భార్య  సూర్యకాంతం మరణించారు. ఒంటరితనం తో ఉన్న కాకరాల గత కొన్ని నెలలుగా తన సోదరుడితో కలిసి బెంగళూరులో ఉంటున్నారు. 84 ఏళ్ల వయసులోనూ పెద్ద అనారోగ్య సమస్యలు ఏవీ లేని కాకరాల ఫిజియోథెరపీ కొరకు డాక్టర్ బాలాజీ వద్ద చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నేత కందారపు మురళి ఆయనను కలిసి యోగక్షేమాలు విచారించారు. వివిధ అంశాలపై చర్చించారు. కాకరాలతో పాటు అభ్యుదయ కవి, రచయిత వి. చెంచయ్య, డాక్టర్ బాలాజీ తదితరులు ఉన్నారు.

పుంగనూరు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పూలత్యాగరాజు జన్మదిన వేడుకలు

Tags; CPM leader Kandarapu Murali visits senior actor ‘Kakarala’

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page