పుంగనూరులో కోడి కూతకు మునుపే పెన్షన్లు పంపిణీ

0 9,475

పుంగనూరు ముచ్చట్లు:

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారులు, ప్రజాప్రతినిధులు, వలంటీర్లు కోడికూతకు మునుపే లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. బుధవారం పట్టణంలో కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో చైర్మన్‌ అలీమ్‌బాషా, వైస్‌ చైర్మన్‌ సిఆర్‌.లలిత , సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు కలసి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. అలాగే పట్టణంలోని 31 వార్డుల్లోను కౌన్సిలర్లు కొండవీటి కాంతమ్మ, అమ్ము, పూలత్యాగరాజు, అర్షద్‌అలీ, కిజర్‌ఖాన్‌, తుంగామంజునాథ్‌, రేష్మా, నరసింహులు, ఆదిలక్ష్మి, కమలమ్మ, మమత, విజయభారతి, సాజిదాబేగం, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర లు పెన్షన్లు పంపిణీ చేశారు. 10 గంటలకు మున్సిపాలిటిలో 90 శాతం పెన్షన్లు పంపిణీ చేసి, రికార్డు సృష్టించారు. అలాగే మండలంలో ఎంపీడీవో రాజేశ్వరి, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో 21 సచివాలయాల పరిధిలో పెన్షన్లు పంపిణీ చేశారు.నిద్రలేపి పెన్షన్లు పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

 

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Distribution of pensions before the chicken coop in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page