సంక్షేమ పథకాల అమలులో అలసత్వం వద్దు-ఎమ్మెల్యే ద్వారకనాథరెడి

0 9,733

పుంగనూరు ముచ్చట్లు:

 

అర్హులైన పేదలందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అధించాలని, ఎవరు అలసత్వం వహించినా సహించేది లేదని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన జెడ్పిమాజీ వైస్‌ పెద్దిరెడ్డి, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో రాజేశ్వరి, తహశీల్ధార్‌ వెంకట్రాయులతో కలసి మున్సిపల్‌ కార్యాలయంలో మండల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, సచివాలయ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలు అర్హులందరికి అందించే భాద్యత క్రింది స్థాయి అధికారుల నుంచి పైస్థాయి అధికారుల వరకు ఉందన్నారు. అర్హులకు పెన్షన్లు, ఇండ్లు, విద్యాదీవేన, రైతు భరోసా, చేయూత, ఆసరా పథకాలు వందశాతం అందించాలన్నారు. అర్హులకు రాకపోతే దాని పై వివరణ ఇచ్చి, లబ్ధిదారులకు పథకం అందేలా చూడాలన్నారు. అలాగే ప్రతి సచివాలయ పరిధిలోను అర్హులు, అనర్హుల జాబితాలు సిద్దం చేయాలన్నారు. వీటితో పాటు అందుతున్న పథకాల వివరాలను సిద్దం చేయాలన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు, కులాలకు , మతాలకతీతంగా పథకాలు అందించడమే లక్ష్యంగా మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. రాష్ట్రంలో పుంగనూరు నియోజకవర్గం ఆదర్శవంతంగా ఉండేలా అందరు పనిచేసి, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలన్నారు. కొన్ని ప్రాంతాలలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిని సరిదిద్దుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో సీఐ గంగిరెడ్డి, చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం,ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, వైఎస్‌ఆర్‌సి జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌, పార్టీ మండల అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పూలత్యాగరాజు జన్మదిన వేడుకలు

Tags; Do not be lazy in the implementation of welfare schemes-MLA Dwarakanathareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page