మధ్యపాన రహిత గ్రామాలే ధ్యేయం- సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

0 9,135

రామసముద్రం ముచ్చట్లు:

మధ్యపాన రహిత గ్రామాలే ధ్యేయమని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. బుధవారం స్థానిక పంచాయతీ పరిధిలోని కెసిపల్లి, గుంతయంబాడి, వై.కురప్పల్లి, వనగానిపల్లి, జోగిండ్లు, మిట్టయంబాడి గ్రామాల్లో మధ్యం అమ్మకాలు జరపరాదని, గ్రామాల్లో పేకాట, కోడిపందెంలాంటి అసాంఘీక కార్యకలాపాలు చేస్తే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రద్దు అవుతాయని దండోరా వేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా మధ్యపాన రహిత గ్రామలుగా తీర్చిదిద్దడానికి స్థానిక శాసనసభ్యులు నవాజ్ బాషా సూచనల మేరకు వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన సందర్భంలో మహిళలు విన్నపాన్ని స్వీకరించి అధికారంలోకి రాగానే మధ్యపానాన్ని నిషేదించారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బాటలోనే ఎమ్మెల్యే నవాజ్ బాషా కూడా పయనిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మధ్యపాన రహిత గ్రామలుగా తీర్చిదిద్ధి, ప్రశాంతతకు మారుపేరైనా గ్రామాల్లో మధ్యం చిచ్చు ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ నేపథ్యంలో వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎవరైనా మధ్యం అమ్మినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కట్ చేస్తామని హెచ్చరించారు. ఆధార్, రేషన్ కార్డు, పెన్షన్ వంటివి రద్దు చేస్తామని దండోరా వేయించారు. ఒక వేళ ఎవరైనా మధ్యం అమ్మకాలు చేస్తున్నట్టుగా సమాచారం ఇచ్చినవారికి రూ. 5 వేలు బహుమతులు కూడా ఇస్తామన్నారు. కెసిపల్లి పంచాయతీని మధ్యపాన రహితంగా మార్చే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. గ్రామాల్లో మధ్యం అమ్మకాలకు అడ్డుకట్ట వేయడానికి తీసుకున్న నిర్ణయం పట్ల మహిళలు ఎమ్మెల్యే నవాజ్ బాషాకు, సర్పంచ్ శ్రీనివాసులురెడ్డికు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

 

 

 

Tags:Non-alcoholic villages are the goal- Sarpanch Srinivasureddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page