22 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

0 8,278

తిరుపతి ముచ్చట్లు:

శ్రీవారిమెట్టు సమీపంలో గురువారం తెల్లవారుజామున 22 ఎర్ర చందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాల మేరకు డిఎస్పీ మురళీధర్ పర్యవేక్షణలో ఆర్ ఎస్ ఐ లింగాధర్ టీమ్ బుధవారం రాత్రి నుంచి చామల రేంజ్ నాగపట్ల ఈస్ట్ సెక్షన్ పరిధిలో కూంబింగ్ చేపట్టారు. గురువారం తెల్లవారుజామున శ్రీవారి మెట్టు వైపుకు రాగా ,కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది ని గమనించిన వారిలో కొందరు, మిగిలిన వారిని హెచ్చరించేలా కేకలు పెట్టాడు. దీంతో అందరూ దుంగలను పడవేసి చీకట్లో కలిసి పోయారు. దుంగలు పడేసిన ప్రాంతం పరిశీలించగా, 22 ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయి. ఇవి 721 కేజీలు ఉన్నాయని, 40 లక్షల రూపాయల వరకు విలువ ఉండవచ్చు నని ఎస్పీ సుందరరావు తెలిపారు. పారి పోయిన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసును సిఐ చంద్రశేఖర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

- Advertisement -

పుంగనూరు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పూలత్యాగరాజు జన్మదిన వేడుకలు

Tags:22 red sandalwood logs seized

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page