బోయకొండలో భక్తులను ఆకట్టుకొనేలా పార్క్ ఏర్పాటు

0 9,327

– ఆహ్లాదకరమైన వాతావరణంను నెలకొల్పుతాం
– రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెంపకం
– బోయకొండను సందర్శించిన రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి

 

చౌడేపల్లె ముచ్చట్లు:

- Advertisement -

కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేరుగాంచిన బోయకొండ గంగమ్మ ఆలయానికి వచ్చే భక్తులను ఆకట్టుకొనేలా పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకొంటున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఏఐపీపీ మెంబరు అంజిబాబు, ఈఓ చంద్రమౌళితో కలిసి బోయకొండ గంగమ్మ ను దర్శించుకొన్నారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలమేరకు ఉపాధిహామీ నిధులతో ఆలయం వద్ద ఏర్పాటుచేస్తున్న పార్క్ పనులను పరిశీలించారు.ఆలయం వద్ద ఎగుడుదిగుడుగా ఉన్న ప్రాంతంలో బయటినుంచి మట్టిని తరలించి చదువుచేశామని, ఈ స్థలంలో రాజమండ్రి, కడియం , తదితర ప్రాతం నుంచి ఆకర్షణగా నిలిచే మొక్కలను తీసుకొచ్చి నాటుతున్నట్లు పేర్కొన్నారు. బోయకొండకు అత్యంత సుందరంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తీసుకొన్నామన్నారు. ఆలయం వద్ద ఆహ్లాదకరమైన వాతావరణంను నెలకొల్పేలా వెహోక్కలు పెంపకం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పనులను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీఓ శ్రీనివాసుల యాదవ్‌కు సూచించారు.అలాగే బోయకొండ కింద నుంచి కొండపై వరకు రోడ్లకు ఇరువైపులా వెహోక్కలు నాటాలన్నారు.అలాగే అభివృద్ది పనులు త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌లను సూచించారు. ఆయన వెంటసింగిల్‌విండో చైర్మన్‌ రవిరెడ్డి, డిసీసీ వైఎస్‌ చైర్మన్‌ రమేష్‌రెడ్డి,ఎంపిటీసీ నరసింహులుయాదవ్‌,నాయకులు సోమల మల్లికార్జునరెడ్డి, ప్రభాకర్‌యాదవ్‌,మనోహర్‌రెడ్డి, తదితరులున్నారు.

పుంగనూరు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పూలత్యాగరాజు జన్మదిన వేడుకలు

Tags: A park has been set up at Boyakonda to impress the devotees

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page