రాజన్నబాటలోనే జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన – మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

0 10,045

పుంగనూరు ముచ్చట్లు:

 

రాష్ట్రంలో నూతన పరిపాలనకు శ్రీకారం చుట్టి , ఆకాల మరణం పొందిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చూపిన బాటలోనే ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. గురువారం రాజన్న వర్ధంతి సందర్భంగా ఆయన చిత్తూరు ఎంపి రెడ్డెప్పతో కలసి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజన్న ఐదు సంవత్సరాల పాలనలో ఎనలేని పథకాలు తీసుకొచ్చారని, ఆయన మృతి చెంది 12 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలు ఆయనను దేవుడిలా కొలుస్తున్నారని తెలిపారు. అలాంటి రాజన్న మరణం తీరలేనిదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోగన్‌రెడ్డి పాదయాత్రలో గుర్తించిన సమస్యలను మ్యానిఫెస్టోలో పెట్టి, అన్ని పరిష్కరించారని ప్రశంసించారు. తండ్రిని మించిన తనయుడుగా జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన సాగిస్తుండటం ఈ రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు మద్దతునిచ్చి, అండగా నిలిచి జగన్‌మోహన్‌రెడ్డి చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండేలా ఆశీర్వధించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర జానపద కళల అధ్యక్షుడు కొండవీటి నాగభూషణం, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, వైఎస్‌.ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్‌, పెద్దిరెడ్డి, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కార్యదర్శి విరూపాక్షి జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పూలత్యాగరాజు జన్మదిన వేడుకలు

Tags: Jaganmohan Reddy administration in Rajannabatal – Minister Dr. Peddireddy Ramachandrareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page