పూర్తి పారదర్శకంగా బ్యాట‌రీ కార్ల కొనుగోలు

0 9,454

తిరుపతి ముచ్చట్లు:

 

బ్యాట‌రీ కార్ల కొనుగోలు విష‌యంలో మ‌త‌ల‌బు జ‌రిగింద‌ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి  కందారపు మురళి చేసిన ఆరోప‌ణ‌లు పూర్తిగా అవాస్త‌వం. వాస్త‌వ వివ‌రాల‌ను తెలియ‌జేస్తున్నాం.- తిరుమ‌ల‌లో వాహ‌నాల కాలుష్యాన్ని త‌గ్గించ‌డం ద్వారా ప‌విత్ర‌త‌ను, పర్యావరణాన్ని కాపాడేందుకు టిటిడి అధికారిక విధుల కోసం 35 విద్యుత్ కార్ల‌ను(టాటా నెక్సాన్‌) ప్రభుత్వరంగ సంస్థ అయిన క‌న్వ‌ర్జ‌న్స్ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌(సిఇఎస్‌ఎల్‌) నుండి కొనుగోలు చేసింది. సిఇఎస్‌ఎల్ అనేది ప్ర‌యివేటు సంస్థ కాదు. ఇది కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఆధ్వ‌ర్యంలోని ప్ర‌భుత్వరంగ సంస్థ‌లైన ఎన్‌టిపిసి, ఆర్ఇసి, ప‌వ‌ర్‌గ్రిడ్‌, పిఎఫ్‌సిల జాయింట్ వెంచ‌ర్‌. నెల‌కు రూ.32 వేలు చొప్పున 5 సంవ‌త్స‌రాల పాటు ఇఎంఐ చెల్లిస్తే విద్యుత్ వాహ‌నం సొంత‌మ‌య్యేలా టిటిడి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో వాహ‌నాల వార్షిక నిర్వ‌హ‌ణ వ్య‌యం(ఏఎంసి) కూడా ఇమిడి ఉంద‌నే విష‌యాన్ని గుర్తించాలి. ప్ర‌భుత్వరంగ సంస్థ అయిన సిఇఎస్‌ఎల్ జాతీయ విధాన నిర్ణ‌యం ప్రాతిప‌దిక‌న‌ విద్యుత్ కార్ల విక్ర‌యాలు చేప‌డుతుంది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా 4 వేల విద్యుత్ వాహ‌నాల‌ను ఈ సంస్థ విక్ర‌యించింది. సిఇఎస్‌ఎల్ సంస్థ మార్కెట్లో మిగిలిన వారికి నెల‌కు రూ.35 వేలు ఇఎంఐ చొప్పున విద్యుత్ కార్ల విక్ర‌యాలు చేప‌డుతుండ‌గా, టిటిడి ధార్మిక సంస్థ కావ‌డంతో రూ.32 వేలకే ప్ర‌త్యేక త‌గ్గింపు ధ‌ర‌తో వాహ‌నాల‌ను అందించింది.వాస్తవాలు ఇలా ఉండగా, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేసేముందు సంబంధిత అధికారులను సంప్రదించి ఉండాల్సింది. అవాస్తవాలను ప్రచారం చేయడం మంచిది కాదని తెలియజేస్తున్నాం.

- Advertisement -

పుంగనూరు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పూలత్యాగరాజు జన్మదిన వేడుకలు

Tags; Purchase of fully transparent battery cars

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page