పుంగనూరులో రాజన్నకు ఘన నివాళులు-మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

0 9,737

పుంగనూరు ముచ్చట్లు:

 

దివంగత మహానేత , రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బస్టాండులో, మండలంలోని సుగాలిమిట్టలో గల వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపి రెడ్డెప్ప, కమిషనర్‌ కెఎల్‌.వర్మ, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్‌, పెద్దిరెడ్డి, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి కలసి పూజలు చేసి, పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వైఎస్‌ఆర్‌ అమర్‌రహే… జగన్మోహన్‌రెడ్డి జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లయన్స్క్లబ్‌ ఆధ్వర్యంలో రక్తదానశిభిరం ఏర్పాటు చేశారు. సుగాలిమిట్టలో అన్నదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, లలిత, వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కార్యదర్శులు విరూపాక్షి జయచంద్రారెడ్డి, నారదరెడ్డి, ఫకృద్ధిన్‌షరీఫ్‌, చంద్రారెడ్డియాదవ్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర, అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు అమ్ము తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పూలత్యాగరాజు జన్మదిన వేడుకలు

Tags; Solid tributes to Rajanna at Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page