బెంగ‌ళూరులోని శ్రీ‌వారి ఆల‌యాన్ని సంద‌ర్శించిన టిటిడి ఈవో

0 10,008

తిరుమల ముచ్చట్లు:

టిటిడి ఈఓ డాక్ట‌ర్ కెఎస్‌.జవహర్‌రెడ్డి గురువారం బెంగళూరు న‌గ‌రంలోని వయ్యాలికావల్ ప్రాంతంలో గ‌ల శ్రీ‌వారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఈఓకు టిటిడి అధికారులు, అర్చ‌కులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.అనంతరం ఈఓ అక్క‌డి టిటిడి కల్యాణ‌మండ‌పాన్ని, శ్రీ వేంక‌టేశ్వ‌ర భక్తి ఛాన‌ల్ కన్నడ కార్యాలయాన్ని ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ రానున్న అక్టోబర్ నెల‌లో ఎస్వీబీసీ కన్నడ ఛానెల్ ప్ర‌సారాల‌ను ప్రారంభిస్తామ‌న్నారు. ఛానల్ ప్రారంభం సందర్భంగా పురందరదాస కీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎస్వీబీసీ సీఈఓ సురేష్ కుమార్‌కు సూచించారు.

- Advertisement -

పుంగనూరు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పూలత్యాగరాజు జన్మదిన వేడుకలు

 

Tags:TTD Evo visiting Srivari Temple in Bangalore

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page