రాష్ట్రం దాటినా వాలింటర్ సేవలు

0 8,848

– కర్ణాటకలో చికిత్స పొందుతున్న మహిళకు పింఛన్ పంపిణీ
– శభాష్ వాలింటర్ అంటూ ప్రశంసలు
రామసముద్రం ముచ్చట్లు:

వైకాపా అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి వాలింటర్ వ్యవస్థను తీసుకువచ్చారు. 50 కుటుంబాలకు ఒక వాలింటరును నియమించి వారి ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఈ వ్యవస్థ ప్రారంభించిన సందర్భంలో విపక్షాలు ఎన్నో రకాలుగా విమర్శించారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని వాలింటర్ వ్యవస్థ చాలా బాగుందని ఇతర రాష్ట్రాలు సైతం ఆలోచించే విధంగా వాలింటర్ సేవలు వినియోగపడుతున్నాయి. గతంలో కరోన విలయతాండవం చేసిన సందర్భంలో కూడా వాలింటర్లు ప్రాణాలకు తెగించి ప్రతి కుటుంబాన్ని సందర్శించి జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారి వివరాలు సేకరించి కరోన అడ్డుకట్ట వేయడంలో విజయవంతం అయ్యారు.అప్పట్లో మన ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన వాలింటర్ల వల్లే సులభంగా కరోన వ్యాధిగ్రస్తులను గుర్తించారని, విమర్శించిన విపక్షాలే పొగడ్తలు కురిపించే విధంగా వాలింటర్లు విధులు నిర్వహిస్తున్నారు. రామసముద్రం మండలం కుదురుచీమనపల్లి పంచాయతీలో సీఆర్.రెడ్డెమ్మ అనే మహిళ వితంతు పింఛన్ అందుకుంటుంది. గత కొన్ని రోజుల క్రితం రెడ్డెమ్మ అనారోగ్యానికి గురైంది. దింతో చికిత్స కోసం రెడ్డెమ్మ తన బంధువులు ఉంటున్న ములబాగిలు సమీపంలోని హెచ్ఎన్.హళ్లికు వెళ్లింది. ప్రతి నెలా కోడికూతకు మునుపే వాలింటర్ల ద్వారా పింఛన్లు అందిస్తున్నారు. ఈ క్రమంలో 1వ తేదీన రెడ్డెమ్మ పింఛన్ తీసుకోవడానికి రాలేదు. రెడ్డెమ్మ బంధువులు సర్పంచ్ శ్రీనివాసులురెడ్డికు ఫోన్ చేసి రెడ్డెమ్మ అనారోగ్యానికి గురైందని సమాచారం అందించారు. రెండు నెలల పింఛన్ ఒకేసారి తీసుకునే విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో అనారోగ్యానికి గురైన రెడ్డెమ్మ మందులకు ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ డబ్బులు ఉపయోగపడతాయనే సుద్దేశ్యంతో వెంటనే రెడ్డెమ్మ ఉంటున్న గ్రామానికి వెళ్లి పింఛన్ అందివ్వాలని సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి సంబంధిత వాలింటర్ రేవతిను ఆదేశించారు. గురువారం ఉదయం వాలింటర్ రేవతి తన భర్త ప్రకాష్ రెడ్డితో కలిసి రెడ్డెమ్మ ఉంటున్న హెచ్ఎన్.హళ్లికు వెళ్లి పింఛన్ అందించారు. రాష్ట్రం దాటి వెళ్లి పింఛన్ అందించిన వాలింటర్ రేవతిను సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి, పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, వెల్పేర్ అసిస్టెంట్ ఉపేంద్ర, స్థానిక యువత నేతలు బాబు, ఎల్లారెడ్డిలు శభాష్ వాలింటర్ అంటూ ప్రశంసించారు.

- Advertisement -

 

పుంగనూరు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పూలత్యాగరాజు జన్మదిన వేడుకలు

Tags:Volunteer services across the state

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page