పలమనేరులో 60 అడుగుల వైఎస్సార్‌ విగ్రహం

0 8,617

పలమనేరు  ముచ్చట్లు:

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 60 అడుగుల విగ్రహాన్ని చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ వీరాభిమాని ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వైఎస్సార్‌ విగ్రహాల్లో ఇదే ఎత్తయినది. వైఎస్సార్‌ 12వ వర్ధంతి సందర్భంగా గురువారం విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.పట్టణానికి చెందిన దేవీగ్రూప్‌ మేనేజింగ్‌ పార్టనర్, గంగవరం మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సి.వి.కుమార్‌ తన స్థలంలో సొంత నిధులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడుకు చెందిన కాళీశ్వరన్‌ తొమ్మిది నెలలు కష్టపడి ఈ విగ్రహాన్ని రూపొందించారు. పలమనేరు సమీపంలోని చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిలో వైఎస్సార్‌ సర్కిల్‌ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా మారింది.

 

- Advertisement -

పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:A 60-foot statue of YSSAR in Palamaner

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page