బీఫార్మసీసర్టిఫికెట్‌ తెచ్చుకునేందుకు వెళ్తుండగా వంకలో కొట్టుకుపోయిన కారు

0 7,569

 అనంతపురంముచ్చట్లు:

కదిరిలో విషాదం చోటు చేసుకుంది. కదిరి-పులివెందుల మధ్య ఒదులపల్లి వంకలో కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో బీఫార్మసీ విద్యార్థి బాబ్జాన్‌, డ్రైవర్‌ రఫీ గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షింతగా బయటపడ్డారు. బాబ్జాన్‌ మృతదేహం లభ్యం కాగా, రఫీ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బీఫార్మసీ సర్టిఫికెట్‌ తెచ్చుకునేందుకు కదిరి నుంచి విజయవాడ వెళ్తుండగా ఘటన జరిగింది.

కదిరి-పులివెందుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరా అవుతాడనుకున్న తమ బిడ్డ ఊహించని విధంగా మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సర్టిఫికెట్‌తో వస్తాడనుకున్న తమ బిడ్డ విగత జీవిగా పడి ఉండటంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Car washed in a bend while going to get a beepharmacy certificate

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page