ఇలాంటి పందుల పోటీలు ఎప్పుడైనా చూశారా?

0 8,761

గాజువాక ముచ్చట్లు:

కోడి పందాలు చూశాం.. పొట్టేళ్ల పందాలు చూశాం. కానీ పందుల పోటీలు ఎప్పుడైనా.. ఎక్కడైనా చూశారా.? ఇప్పుడు పందుల పోటీలకు వుడా కాలనీ వేదికైంది. మండలంలోని కొత్తకర్ణవానిపాలెం వుడా కాలనీలో వాకర్స్‌ కోసం ఏర్పాటు చేసిన స్థలంలో బహిరంగంగా పెంపకందారులు గురువారం పందుల పందాలు నిర్వహించారు.

రెండు పందుల మధ్య పోటీ పెట్టి వారంతా చుట్టూ చేరి కేరింతలు కొట్టారు. దీంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. ఒక పక్క జీవీఎంసీ అధికారులు పందులను ఏరివేస్తుంటే మరోపక్క పెంపకందారులు ఈ పోటీలను నిర్వహించి ఆశ్చర్యానికి గురి చేశారు. భవిష్యత్‌లో ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Have you ever seen pig competitions like this?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page