టిటిడి క‌ళాశాల‌లకు ఐఎస్ఓ స‌ర్టిఫికెట్‌

0 8,555

తిరుప‌తి ముచ్చట్లు:

 

– ఈవో చేతుల‌మీదుగా ప్రిన్సిపాళ్ళ‌కు అందించిన ఐఎస్ఓ బృందం

- Advertisement -

టిటిడి నిర్వ‌హ‌ణ‌లోని ఎస్వీ ఆర్ట్స్‌ క‌ళాశాల, శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళ డిగ్రీ, పిజి క‌ళాశాల, శ్రీ గోవింద‌రాజ స్వామి ఆర్ట్స్ క‌ళాశాలలకు ఐఎస్ఓ స‌ర్టిఫికెట్ల‌ను శుక్ర‌వారం ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి చాంబ‌ర్‌లో ఆయ‌న చేతుల మీదుగా క‌మిటీ స‌భ్యులు ఆయా క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్ళ‌కు అందించారు.

క‌ళాశాల‌లో డాక్యుమెంట్ల నిర్వ‌హ‌ణ‌, ఉత్త‌మ మౌళిక స‌దుపాయాలు, ఉత్త‌మ విద్యా ప్ర‌మాణాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఐఎస్ఓ-9001, క‌ళాశాల‌ల్లో ప‌చ్చ‌ద‌నం పెంపొందించ‌డం, వ‌ర్ష‌పు నీటిని సంర‌క్షించ‌డం, ప్లాస్టిక్ ఇత‌ర వ్య‌ర్థ ప‌దార్థాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఐఎస్ఓ – 14001 స‌ర్టిఫికెట్ల‌ను అందించారు. దీంతో పాటు క‌ళాశాల‌ల కార్యాల‌యాలు, త‌ర‌గ‌తి గ‌దులు, ల్యాబ్‌లు, హాస్ట‌ల్ భ‌వ‌నాల్లో విద్యుత్ పొదుపున‌కు సంబంధించి ఐఎస్ఓ -50001 స‌ర్టిఫికెట్‌ను అందించారు. టిటిడి క‌ళాశాల‌ల్లో శుభ్ర‌త, పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌, కోవిడ్ – 19 నిబంధ‌న‌ల అమ‌లు ఎంతో బాగున్నాయ‌ని హెచ్‌వైఎం ఐఎస్ఓ స‌ర్టిఫికెష‌న్ ప్రైవేట్ లిమిటెడ్ యండి శ్రీ ఆల‌పాటి శివ‌య్య, డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి మౌళిక అభినందించారు.

టిటిడి క‌ళాశాల్లో చ‌క్క‌టి విద్యా ప్ర‌మాణాలు, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ, విద్యుత్ పొదుపు, రికార్డుల నిర్వ‌హ‌ణ జ‌రిగేలా చేస్తున్న జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, టిటిడి విద్యా శాఖాధికారి శ్రీ గోవింద‌రాజ‌న్ ఎస్పిడ‌బ్ల్యు క‌ళాశాల ప్రిన్సిప‌ల్ శ్రీ‌మ‌తి మ‌హ‌దేవ‌మ్మ‌, ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల ప్రిన్సిప‌ల్ శ్రీ‌మ‌తి నారాయ‌ణ‌మ్మ‌, ఎస్‌జిఎస్ ఆర్ట్స్ క‌ళాశాల ప్రిన్సిప‌ల్ శ్రీ వేణుగోపాల్ రెడ్డిని ఈవో ఈ సంద‌ర్భంగా అభినందించారు.

జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, ఎఫ్ఎ అండ్ సిఎవో శ్రీ బాలాజి, టిటిడి విద్యా శాఖాధికారి శ్రీ గోవింద‌రాజ‌న్ పాల్గొన్నారు.

 

పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:ISO Certificate for TTD Colleges

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page