శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

0 8,629

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రావణమాసంలో చివరి శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.ఇందులో భాగంగా ఆలయంలోని మండపంలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, శ్రీ సరస్వతి అమ్మవారు, శ్రీ కామాక్షి అమ్మవార్లను కొలువుదీర్చి కుంకుమార్చన చేప‌ట్టారు. ముందుగా క‌ల‌శ‌స్థాప‌న‌, గ‌ణ‌ప‌తి పూజ‌, పుణ్యాహ‌వ‌చనం, క‌ల‌శారాధ‌న చేశారు. ఈ సందర్భంగా లక్ష సార్లు కుంకుమతో అమ్మవారికి అర్చన చేశారు.ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో  సుబ్రమణ్యం, ఏఈవో  స‌త్రేనాయ‌క్‌, సూపరింటెండెంట్‌  భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  రెడ్డి శేఖ‌ర్ పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Laksha Kunkumarchana at Sri Kapileswara Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page