పుంగనూరు కవులు, రచయితలను సన్మానించిన బిజెపి నాయకులు…

0 8,759

పుంగనూరు ముచ్చట్లు :

భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు తెలుగు భాష వ్యవహారిక భాష పితా మహులు, గిడుగు
వెంకట రామమూర్తి  జన్మదినం, మరియు తెలుగు బాషావారోత్సవాల సందర్భంగా శనివారం పుంగనూరు స్థానిక సాయి బాబా కల్యాణ మండపం నందు పుంగనూరు నియోజకవర్గం లోని తెలుగు రచయితలు,కవులు తెలుగు భాష,మాతృభాష గొప్పతనాన్ని గూర్చి వారి వారి రచనలు,కవిత్వాల ద్వార తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తున్న తెలుగు రచయితలు విభాగం నుండి  బత్తల మునిరత్నం రెడ్డి,దాసరి కృష్ణా రెడ్డి,రెడ్డెప్ప, సాల్వ రాజు సతీష్,రామలింగప్ప,  జమున మరియు హసీనా భేగం,హరికత తెలుగు భాష పండితుల విభాగం నుండి నాగభూషణ రావు,రామకృష్ణా రెడ్డి,తెలుగు భాషా పండితులు విశ్రాంత ఉపద్యాయులు వెంకటపతి సీతాపతి రాజు లను ఘనంగా సన్మానించడం జరిగింది.అనంతరం విరివిగా రచయితలు, కవులు,తెలుగు భాష మాధుర్యాన్ని,గొప్పతనాన్ని గూర్చి తమ దైన శైలిలో ప్రసంగించారు. నేడు తెలుగు భాష వారోత్సవాల సందర్భంగా తెలుగు భాష ఉనికిని దేశ విదేశాలలో ఉన్న తెలుగు వారందరు తమ పిల్లలకు సైతం తెలుగులో మాట్లాడి తెలుగు భాష మాధుర్యాన్ని గూర్చి మన సంప్రదాయాలను వారికి తప్పక నేర్పించి భరతమాత తెలుగుతల్లి రుణం తీర్చుకునేందుకు కృషి చేయాలని కోరారు.కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు రాజా రెడ్డి, మదన మోహన్,ఆయుబ్ ఖాన్,రాజాం పేట జిల్లా మోక్ష ఓబిసి ఉపాధ్యక్షులు గణేష్, ఎస్సి మోక్ష అధ్యక్షులు శ్రీనివాస్,జిల్లా ఉపద్యక్షురాలు  మల్లిక,నాయకులు టివి ఎస్ ప్రసాద్, బాబు,పురుషోత్తం,రాజా జెట్టి,మణి మొదలియర్ మురళి,విజయ్ శంకర్, ప్రవీణ్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: BJP leaders pay homage to Punganur poets and writers …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page