పుంగనూరులో రైతులకు అవసరమైన సలహాలు అందించాలి -ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌

0 10,138

పుంగనూరు ముచ్చట్లు:

 

రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అందించాలని ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ అన్నారు. శనివారం రైతు సలహా మండలి శిక్షణా కార్యక్రమంలో మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డితో కలసి పాల్గొన్నారు. వెంకటరెడ్డి యాదవ్‌ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని కొనియాడారు. రాష్ట్రంలో మునుపెనడు లేని విధంగా రైతుల కోసం ఆర్‌బికెలు ఏర్పాటు చేసి, రైతు కమిటి లు నియమించి, ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. అలాగే భూసార పరిరక్షణ చేపట్టి, రైతులు పండించేందుకు అనువైన పంటలు పండించేందుకు విత్తనాలు, ఎరువులు అందించడం జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో ఏడి లక్ష్మానాయక్‌, ఏవో సంధ్య, హెచ్‌వో లకిప్రసన్న, వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌, నాలుగు మండలాలకు చెందిన కమిటి సభ్యులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Provide necessary advice to farmers in Punganur – MUDA Chairman Venkatereddy Yadav

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page