రాజనాలబండలో ప్రత్యేక పూజలు

0 8,584

– వీరాంజనేయస్వామి కు అభిషేకాలు
-లక్ష్మినరసింహస్వామి కొండెక్కిన భక్తులు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండలో శనివారం భక్తులు ప్రత్యేక ప్రూజలు,అభిషేకాలు నిర్వహించారు. పూర్వీకులనుంచి శ్రావణమాస చివరి శనివారం, ఆదివారం భక్తి శ్రద్దలతో వైభవంగా తిరుణాలను నిర్వహించడం ఆనాటి నుంచి నేటీకూ సాంప్రదాయంగా వస్తోంది. కోవిడ్‌ పరిస్థితుల కారణంగా అధికారుల సూచనల మేరకు ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు తిరుణాళను రద్దుచేశారు. భక్తులు భక్తి శ్రధ్దలతో ఉపవాసాలు ఉండి స్వామివారికి పూజలు చేశారు. నిర్వాహకులు ఆలయాన్ని వ్యిధ్యుత్‌దీపాలు , పూలతో ప్రత్యేకంగా ముస్తాబుచేశారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులు శ్రీ వీరాంజనేయస్వామికు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడనుంచి రాజనాలబండకు సమీపంలో ఎత్తెన కొండపై వెలసిన శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయానికి కాలినడకన చేరుకొని భక్తులు స్వామివారికి అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం కొండపై వెలసిన ఆలయం వద్ద శనివారం రాత్రి అఖండధీపారాధన వెలిగించారు.

పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Special pujas at Rajanalabanda

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page