ఉపాధ్యాయుడు బదిలీతో విద్యార్థులు కంటతడి

0 10,027

చెన్నై ముచ్చట్లు:

 

“చెన్నైలోని తిరువళ్ళూరు ప్రభుత్వ ఉన్నతపాఠశాల ఉదయం 11 గంటలు ,ఉన్నట్లుండి విద్యార్ధుల ఏడుపులతో దద్దరిల్లిపోయింది..ఏమి జరుగుతుందో తెలియక బయట వున్నవారు పరుగున పాఠశాలలోనికి పరిగెత్తారు..అక్కడకు వెళ్ళినవారు అక్కడ జరుగుతున్నది చూసి నిర్ఘాంతపోయారు.. విద్యార్ధులు ఒక 30 యేండ్ల యువకుని చుట్టిముట్టి ఏదో ప్రాదేయపడుతూ ,వేడుకుంటున్నారు..కొందరు కాళ్ళు పట్టుకొని కదలనీయడంలేదు..ఆశ్చర్యమేమిటంటే ఆ యువకుడూ వారితో పాటు ఏడుస్తూవున్నాడు…ఇంతకీ అక్కడ ఏమిజరుగుతుంది??జె.భగవాన్ ఆ పాఠశాలలో 2014లో ఇంగ్లీషు టీచర్ గా జాయిన్ అయినాడు..అక్కడ చదివే పిల్లలంతా చాలా వరకు పేదకుటుంబాల నుండి వచ్చినవారే.భగవాన్ సర్వీస్ జాయిన్ అయినప్పటినుండీ పిల్లలతో స్నేహితుడిగా కలిసిపోయాడు. ఆప్యాయంగా మాట్లాడటం!! ఎంతో నేర్పుగా వారికి బోధన చేయడం,!కొందరికి భవిష్యత్ చదువుల గురించి వివరించేవాడు,,పిల్లలకు ఎంతో ఇష్టుడైనాడు..అలాంటి భగవాన్ కి ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వచ్చింది…అది తెలిసిన పిల్లలు అతనిని వెళ్ళనివ్వకుండా అడ్డుపడ్డారు,, ఇది వైరల్ అయి రాష్ట్రమంతా సంచలనంగా మారి రాష్ట్రవిద్యాశాధికారులకు చేరింది..ప్రస్తుతానికి 10రోజులు బదిలీ ఆపుతూ ఉత్తర్యులు ఇచ్చారు.

- Advertisement -

పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Students tear up with teacher transfer

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page