బలిజల ఆత్మబంధువు మంత్రి పెద్దిరెడ్డి – పోకల వెల్లడి

1 10,112

-20 వేల మందితో సన్మానం

 

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

బలిజకులస్తుల ఆత్మబంధువుగా మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలిజలను అభివృద్ధి చేస్తున్నారని కాపు సంఘ రాష్ట్ర నాయకుడు పోకల అశోక్‌కుమార్‌ కొనియాడారు. ఆదివారం సాయంత్రం బలిజకులస్తుల సమావేశాన్ని రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, సంఘ అధ్యక్షుడు నానబాలగణేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. అతిధిగా హాజరైన పోకల మాట్లాడుతూ జిల్లాలో బలిజలకు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి పెద్దిరెడ్డి, బలిజలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, రాజకీయ పదవులు కట్టబెట్టారని తెలిపారు. గత ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్‌సిపి ఇచ్చిన హామిల మేరకు ప్రభుత్వం ఏర్పాటు కాగానే రాష్ట్రంలోని కాపులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, ఆదుకుని, సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని స్పష్టం చేశారు. కాపులకు ఎన్నడు లేని విధంగా అధిక గుర్తింపు ఇచ్చిన మంత్రి పెద్దిరెడ్డిని సన్మానించేందుకు నిర్ణయించామన్నారు. ఈ మేరకు ప్రభుత్వ విఫ్‌ సామినేని ఉదయబాను ఆధ్వర్యంలో పుంగనూరులో 20 వేల మంది జలిజలతో సన్మాన కార్యక్రమం అక్టోబర్‌ వెహోదటివారంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాపులకు చేస్తున్న సేవలను గుర్తించి, ఆయన వెంటే పయనిస్తామని స్పష్టం చేశారు. కొండవీటి నాగభూషణం మాట్లాడుతూ సామాన్య బలిజలకు గుర్తింపు ఇస్తున్న వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి, మంత్రి పెద్దిరెడ్డి కుటుంభానికి బలిజలు రుణపడి ఉండాలన్నారు. ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో అనేక పదవులు బలిజలకు కేటాయించిన ఘనత మంత్రి కుటుంబందేనని కొనియాడారు. ఈ సమావేశంలో కాపుసంఘ నాయకులు పూలత్యాగరాజు, కెసిటివి అధినేత ఎన్‌.ముత్యాలు, గాజుల రామ్మూర్తి, డాక్టర్‌ ప్రభాకర్‌, ఆకుల చెన్నకేశవులు, విజయకుమార్‌, బండిబాలు, శ్రీనివాసులు, తుంగామంజునాథ్‌, జిఆర్‌.కృష్ణ , కిషొర్‌ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

Tags: Balijala Atmabandhuvu Minister Peddireddy – Pokala revealed

1 Comment
  1. S Nagaraja says

    Pokala Ashoke Garu Peddireddi Garu meeku okkariki aatmabandhuvuga nilicharamo gani balijalandariki aatmabandhuvu anaram hasyaspadanga undi. Dayachesi ituvanti sanmana sabhalu petti balijalni redlaku banisaluga cheyyakandi. Ippatike enno dasabdaluga redlaku balijalu sevalu chesthune unnaru vallu balijala needs adipatyam poshiathune unnaru. Ikanyna dasohalu palakadam manukondi. Meeru aarthikanga yedagadaniki meeku annividala sahayapadi undavachu anthegani mimmalni rajakeeyallo matram yedaginivvaledu gurthunchukondi. Adevidanga namamatranga adhikaram leni konni postulichi balijalu meluchesarani meeru bhavisthe adi mummatiki Nizam kadu. Thank you.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page