బోయకొండ గంగమ్మ దేవస్థానం లో టెలిఫోన్ సౌకర్యం

0 8,654

చౌడేపల్లె ముచ్చట్లు:

 

పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యార్థం, మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఆలయ సేవలు వినియోగం కోసం టెలీఫోన్‌ సౌకర్యం కల్పించినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ తెలిపారు. ఆదివారం బోయకొండ అడ్మినిస్ట్రేటీవ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టెలీ పోన్‌ హెల్ప్లైన్‌ కేంద్రాన్ని ఈఓ చంద్రమౌళితో కలిసి ప్రారంభించారు. దేవస్థానం ద్వారా సేవలకోసం 7901642845,7901642846 నెంబరును వసతి గదులకోసం 7901642847 నెంబర్లుకు కాల్‌ చేసి సేవలు పొందవచ్చునని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు కాల్‌ చేయాలని తెలిపారు.ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

- Advertisement -

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

Tags: Telephone facility at Boyakonda Gangamma Temple

 

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page