ఎంబీబీఎస్ పాస్ చేయిస్తానని మోసం ,నకిలీ బాబాపై పిర్యాదు

0 5,753

హైదరాబాద్ ముచ్చట్లు:
ఎంబీబీఎస్ పరీక్షలు పాస్ చేయిస్తానని ఒక బాబా చేసిన మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైబరాబాద్ పోలీసు పరిధి గచ్చిబౌలి లో ఈ ఘటన జరింది. తనకు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన యువతిని కాలభైరవ పూజ తో ఎంబీబీఎస్ పాస్ చేయిస్తానని బాబా విశ్వజిత్ జా నమ్మబలికాడు. తన పూజలు ద్వారా యువతి పరీలో పాస్ అవుతుందని అన్నాడు. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎక్సమినేషన్ పాస్ చేయిస్తానని చెప్పడంతో బాధితురాలు నమ్మింది. తన అతింద్రియ శక్తుల ద్వారా ఎంబీబీఎస్  పాస్ చేయిస్తానని వల వేసాడు.  అప్పటికే విడతలవారీగా 80 వేల నగదును అకౌంట్లో జమ చేయించుకున్నారు. బాధితురాలు బాబాను సంప్రదించేందుకు అనేక మార్లు ఫోన్ చేసిన స్పందించలేదు. దీంతో మోసపోయానని గుర్తించిన యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

- Advertisement -

Tags:Complain on fraudulent, fake Baba that MBBS will pass

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page