వానల అలెర్ట్

0 8,592

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ రాష్ట్రాల్లో ఈ నెల 9వ తేదీ వ‌ర‌కు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ‌ ( IMD ) హెచ్చ‌రించింది. కోస్తాలో ఇవాళ‌, తెలంగాణ ఇవాళ‌, రేపు, మ‌ధ్య మ‌హారాష్ర్ట‌లో రేపు, గుజ‌రాత్‌లో 8,9 తేదీల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. 6, 7 తేదీల్లో ఒడిశా, కోస్తాల్ ఆంధ్ర‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, విద‌ర్భ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. సెప్టెంబ‌ర్ 6 నుంచి 10వ తేదీ మ‌ధ్య‌లో మ‌ర‌ఠ్వాడా, మ‌ధ్య మ‌హారాష్ట్ర‌, కొంక‌ణ్‌, గుజ‌రాత్‌లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది.ఇక ఉత్త‌ర భార‌తదేశంలోని హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, పంజాబ్‌, హ‌ర్యానా, జ‌మ్మూ రీజియ‌న్‌తో పాటు ఈస్ట్ రాజ‌స్థాన్‌లో 7 నుంచి 10వ తేదీ మ‌ధ్య‌లో వ‌ర్షాలు కురియ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ నెల 8 నుంచి 10వ తేదీ మ‌ధ్య‌లో ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంది. రాబోయే రెండు గంట‌ల్లో ఢిల్లీ వ్యాప్తంగా మోస్త‌రు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

- Advertisement -

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

Tags; Rain Alert

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page