చవితి వేడుకలకు అనుమతి కోసం ర్యాలీ

0 5,287

అనంతపురం ముచ్చట్లు:

వినాయక చవితి వేడుకలకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ సురక్ష సేవ సమితి ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది హిందూ సోదరులు సుగురు ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి అక్కడ నుండి ప్రధాన రహదారి గుండా తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ హిందూ సురక్ష సేవ సమితి వినాయక సేవా సమితి బిజెపి ఆధ్వర్యంలో హిందూ సంప్రదాయాన్ని పరిరక్షించే విధంగా వినాయక చవితి వేడుకలు యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సుగురు ఆంజనేయస్వామి దేవాలయం నుండి వాల్మీకి సర్కిల్ చిన్న మార్కెట్ ఎం యప్  రోడ్డు అంబేద్కర్ సర్కిల్ మీదుగా తాసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా రాజకీయపరంగా వై ఎస్ ఆర్ సి పి హంగు ఆర్భాటాలు చేయవచ్చు అదే హిందూ పండుగలు చేసుకోవాలంటే కరోనా నిబంధలను అంటూ ఆఖరికి వినాయక ఉత్సవాలు ఇళ్ల కే పరిమితం చేసుకోవాలని ఆర్భాటంగా చేయరాదని ప్రభుత్వం చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా హిందూ పండుగలు కూడా జరపరాదని అడ్డుకోవడం ఎవరిచ్చారు మీకు అధికారం  అంటూ ప్రభుత్వానికి హెచ్చరించారు హిందూపురం పట్టణంలో ప్రతి ఏడాది నిర్వహించే విధంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తామని ఎవరు అడ్డొచ్చినా యధావిధిగా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు అనంతరం తాసిల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం సమర్పించారు.

 

- Advertisement -

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

Tags:Rally for permission for Chaviti celebrations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page