ట్రైబ్యునళ్ల సమస్యలు పరిష్కరించండి

0 9,686

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

ట్రైబ్యునళ్లలో ఖాళీలు, నియామకాల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయస్థానం తీర్పులు, ఉత్తర్వులను కేంద్రం గౌరవించట్లేదని.. తమ సహనాన్ని పరీక్షిస్తోందనిసుప్రీంకోర్టు మండిపడింది. ఈ విషయంలో తమ వద్ద కొన్ని మార్గాలు మాత్రమే ఉన్నాయని, వారంలోగా కేంద్రం తమ తీరు మార్చుకోవాలని స్పష్టం చేసింది. ట్రైబ్యునళ్లలో నియామకాలకు సంబంధించిన విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌, నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ వంటి కీలక అథారిటీల్లో ఖాళీలున్నాయి. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైనవి. వీటితో పాటు సాయుధ బలగాలు, వినియోగదారులకు సంబంధించిన ట్రైబ్యునళ్లలోనూ చాలా ఖాళీలు ఏర్పడ్డాయి.. దీని వల్ల అనేక కేసుల్లో సత్వర పరిష్కారం లభించక వాయిదాలు వేయాల్సిన పరిస్థితి వస్తోంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా .. రెండు నెలల్లోగా ట్రైబ్యునళ్ల నియామకాలు చేపడతామని తెలిపారు. ఈ సమాధానంపై సంతృప్తి చెందని ధర్మాసనం.. ‘‘గత రెండేళ్ల నుంచి ట్రైబ్యునళ్లలో ఖాళీలు ఉన్నాయి.. ఇప్పటి వరకు ఒక్క నియామకం కూడా చేపట్టలేదు.. ఖాళీలను భర్తీ చేపట్టకుండా ట్రైబ్యునళ్లను బలహీనపరుస్తున్నారు.

 

 

- Advertisement -

గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఉత్తర్వులను కేంద్రం గౌరవించకపోవడం చాలా విచారకరం. మేం కేంద్రంతో ఘర్షణకు దిగాలనుకోవట్లేదు. కానీ మీరు మా సహనాన్ని పరీక్షిస్తున్నారు’’ అని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.ఈ వ్యవహారంలో తమ వద్ద కేవలం మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ‘‘కేంద్రం తెచ్చిన ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టంపై స్టే ఇవ్వడం.. ట్రైబ్యునళ్లను రద్దు చేసి హైకోర్టులకు అధికారాలివ్వడం.. స్వయంగా ట్రైబ్యునళ్లలో కోర్టులు నియామకాలు చేపట్టడం.. వీటితో పాటు కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టే ఆప్షన్‌ను కూడా పరిగణించాల్సి వస్తుంది’’ అనిసీజేఐ హెచ్చరించారు.ట్రైబ్యునళ్లలో నియామకాల ప్రక్రియకు వారం రోజులు గడువు విధిస్తున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబరు 13కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అప్పటికైనా కేంద్రం తమ తీరు మార్చుకుంటుందని ఆశిస్తున్నామని పేర్కొంది.

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

Tags: Resolve tribunal issues

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page