అక్టోబరు లో ధర్డ్ వేవ్

0 9,692

హైదరాబాద్ ముచ్చట్లు:

 

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి రెండేళ్లు ప్రపంచాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని ఓ కుదుపు కుదేపేసింది. సెకండ్ వేవ్ తీవ్రత ఇప్పటికీ వెంటాడుతూనే వుంది. దేశంలో సెప్టెంబర్, అక్టోబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. ప్రస్తుతం కరోనా రోజువారీ కేసులు 30 వేలకు తగ్గినప్పటికీ.. మొదటి వేవ్‌లో రోజువారి నమోదైన కేసుల కన్నా.. ఎక్కువే నమోదవుతున్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. సెకండ్ వేవ్ పూర్తిగా ముగిసిందని చెప్పడానికి ఆధారాలేవన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతో ప్రయాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. అందుకే రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. స్పాట్.నాలుగు రోజుల్లో వినాయక చవితి వస్తొంది. సామూహికంగా పెద్ద ఎత్తున పూజలందుకునే గణాథుడి మండపాల ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో వినాయకుడి నవరాత్రులు, నిమజ్జనం రోజున భక్తులు లక్షలాదీగా పాల్గొంటారు. ఇప్పటికే చాలామంది కరోనా నిబంధనలను గాలికి వదిలేశారు. ఈ వినాయక ఉత్సవాల్లో.. కరోనా సూపర్ స్పెడ్ అయ్యే అవకాశలు ఎక్కువగా వున్నాయంటున్నారు.

 

 

- Advertisement -

నిపుణులు. ఇందుకు ఇటీవల ముగిసిన కుంభమేళా ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చారు.కరోనా కారణంగా రెండేళ్ల పాటు స్కూల్ విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకే పరిమితం అయ్యారు. ఇప్పుడిప్పుడే పిల్లలు బడిబాట పడుతున్నారు. అయితే, డెల్టా వేరియంట్, సాధారణ జలుబు, శ్వాసకోస ఇన్‌ఫెక్షన్లు వ్యాపించడం తల్లిదండ్రుల్ని కలవరపెడుతోంది. దీంతో స్కూల్‌కి పిలల్ని పంపేందుకు వెనకాడుతున్నారు. మరోవైపు పండుగల సీజన్, పొలిటికల్ యాక్టివిటి పెరుగుతుండడంతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు . లేదంటే ముప్పుని ముంగిట్లోకి ఆహ్వానించినట్టేనని అంటున్నారు.సాధారణ జనజీవితం గడపాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ కరోనా అంటే .. ఏంటో తెలియదన్నట్టుగా జనాలు ప్రవర్తిస్తున్నారు. కనీసం గత అనుభవనాలను గుర్తించి మసులుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ, సీన్ అప్పుడే అయిపోలేదు.. ఏమరపాటుగా ఉన్నారో.. కనుమరుగై పోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. రోజులు కాదు.. వారాలు కాదు ఈ ఏడాది చివరి వరకూ అప్రమత్తంగా ఉండాల్సిందేనంటున్నారు. థర్డ్‌ వేవ్‌ వచ్చినా రాకపోయినా మాస్కులు, భౌతికదూరంతో పాటు ఇతర జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

Tags: Third wave in October

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page