కోవిడ్ బాధిత గిరిజన విద్యార్థులకు పరామర్శ, పండ్లు పంపిణీ

0 8,751

గిరిజన పిల్లల విషయం లో సహకారం అందించిన వారికి కృతజ్ఞతలు
ఆంధ్ర ప్రదేశ్ యానాదుల గిరిజన సంక్షేమ సంఘం
నెల్లూరు  ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా,కోట మండలం, చిట్టేడు గిరిజన బాలుర పాఠశాల మరియు జూనియర్ కళాశాలకు చెందిన 16 మంది విద్యార్థులు కోవిడ్ బారిన పడి, గూడూరులోని ప్రాంతీయ వైద్యశాల నందు చికిత్స పొందుతున్నారు.వీరినిఆంధ్రప్రదేశ్ యానాదుల(గిరిజన)సంక్షేమ సంఘం టీమ్ మరియు ఏపీ యానాది గిరిజన ఉద్యోగుల సంఘం టీమ్ పరామర్శించడం జరిగింది.ఈ సందర్బంగా గిరిజన విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలను డాక్టర్లని అడిగి తెలుసుకోనడమైనది. విద్యార్థులకు సంబందించి గురుకుల సిబ్బంది తీసుకుంటున్న చర్యలను ప్రిన్సిపాల్ విజయలక్ష్మి నాయకులకు వివరించారు.ప్రస్తుతం విద్యార్థులందరూ కోలుకొంటున్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.గిరిజన విద్యార్థులు కోవిడ్ బారినపడిన విషయం తెలుసుకున్న వెంటనే, సకాలంలో చర్యలు తీసుకున్న కలెక్టర్ , గూడూరు శాసన సభ్యులు , గూడూరు ఆర్డీఓ , గురుకులం సెక్రటరీ , ఐటిడిఎ పిఓ , గురుకులం జిల్లా కన్వీనర్ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్, పి ఎం ఆర్ సి టీమ్ మరియు సిబ్బందికి ప్రత్యేకంగా గిరిజన జాతి తరుపున ధన్యవాదములు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యానాదుల(గిరిజన)సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య,నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇండ్ల రవి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు యల్లంపల్లి రమేష్,  ఏపీ యానాది ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చేవూరు సుబ్బారావు, చింతపూడి సుధాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

- Advertisement -

Tags:Visitation and distribution of fruits to Kovid affected tribal students

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page