వర్షాలతో సింగరేణి ఓసీపీలలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి…

0 5,751

సుమారు లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం…

పెద్దపల్లి ముచ్చట్లు:
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో  రెండురోజులు గా కురుస్తున్న వర్షాలతో  సింగరేణి సంస్థ ఉపరితల  గనులలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. రామగుండం రీజియన్ లో నాలుగు ఓసీపీ లు ఉండగా మేడిపల్లి ఓసీపీ లో దాదాపు బొగ్గు నిల్వలు తగ్గి పోయాయి. మిగిలిన ఓసీపీ 1, 2, 3 ప్రాజెక్ట్ లలో రోజుకు సుమారు 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది.గత రెండు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. దీంతో ఓసిపి గనుల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. పనిస్థలాల్లో వరద నీరు చేరటంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓసిపి ల్లో బురద మయమ కావటంతో భారీ యంత్రాలు సైతం కదలలేని పరిస్థితి నెలకొంది. వర్షం తగ్గితేనే ఓసిపిల్లో  యధావిధిగా బొగ్గు ఉత్పత్తి పుంజుకొనే అవకాశం ఉందని, అధికారులు వెల్లడించారు.

- Advertisement -

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

 

Tags:Coal production in Singareni OCPs due to rains …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page