ఇంకా ఆచూకి దొరకని డాక్టర్

0 8,587

నల్గోండ ముచ్చట్లు:

 

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమీప బంధువు డాక్టర్ జయశీల్ రెడ్డి ఆచూకీ ఇంకా లభించలేదు. ఆయన మిస్సింగ్ మిస్టరీగా మారింది. నిన్న నల్గొండ మండలం మేళ్ళదుప్పలపల్లి  వ్యవసాయ క్షేత్రం వద్ద వరద నీటిలో జయశీల్ రెడ్డి గల్లంతైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మేరకు నిన్నటి నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జయశీల్ రెడ్డి నిజంగా వరదలో గల్లంతయ్యారా….? లేదంటే అదృశ్యం అయ్యారా… ?  అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఖాకీలకు కూడా అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. కాగా ప్రస్తుతం అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంతవరకు ఎలాంటి క్లూ లభించలేదు. ఇదిలావుండగా కొద్దిరోజులుగా జయశీల్ రెడ్డి ఇంట్లో కుటుంబ కలహాలు నడుస్తున్నట్టు సమాచారం. ఆ కలహాల నేపధ్యంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా ? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు.

- Advertisement -

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

Tags; Dr. who has not been found yet

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page