శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి భారీ చేరుతున్న వరద నీరు

0 8,547

పెద్దపల్లి ముచ్చట్లు:

 

రామగుండం నియోజకవర్గం పరధి అంతర్గాం మండలంలో ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీటి ప్రవాహం పెరుగుతుంది. గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరద నీరు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి చేరుతుంది.  ప్రాజెక్ట్ కు సంబంధించిన 40 గేట్లు ఎత్తి వరద నీరు దిగువనకు పంపిస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 430290క్యూసెక్కులు కాగా, ఆవుట్ ఫ్లో 490290 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు ఉండగా, ప్రస్తుత నీటి నిల్వ 18.5361క్యూసెక్కులు ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. మత్య్సకారులు చేపలు పట్టడానికి ప్రాజెక్ట్ కు వెళ్లకూడదని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు సమీపంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే పర్యాటకులు సైతం ఎవరు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సమీపంలోకి వెళ్లకూడదని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

Tags: Heavy flood water entering the Sripada Ellampalli project

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page