మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన మంత్రులు

0 9,691

హైదరాబాద్ ముచ్చట్లు:

 

పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్య నివారణకు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలకే పూజించాలని పర్యావరణ వేత్తలు , అధికారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ‘మట్టి వినాకుడినే పూజిద్దాం’.. వినా యక విగ్రహాల తయారీకి సహజమైన రంగులనే వాడాలని, రసాయనిక రంగులు, ఆయిల్‌ పెయింట్స్‌ వాడొద్దు అంటూ ప్రకృతి ప్రేమికులు సోషల్ అవేర్నెస్ కార్యక్రమం చేపట్టారు. నేపథ్యంలో మట్టి విగ్రహాలను పూజిద్దాం మంటూ హైదరాబాద్ లో గణేష్ విగ్రహాలను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పంపిణి చేశారు. మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అని అటవీ, పర్యావరణ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ లో మట్టి వినాయక విగ్రహాలను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం గణేష్ విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు మట్టి విగ్రహాలనే పూజించాలని కోరారు. ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు అంతకుముందు సికింద్రాబాద్ లోని వినాయకున్ని దర్శించుకుని, మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

Tags: Ministers who distributed clay statues

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page