పేరు కే ఢిల్లీ పార్టీ లు…చేసేవి చిల్లర పనులు-మంత్రి కేటీఆర్

0 8,769

హైదరాబాద్  ముచ్చట్లు:
పార్టీ కి 20 ఏళ్ళు నిండిన తర్వాత చరిత్ర గుర్తు తెచ్చుకోవడం చాలా సంతోషం. కేసీఆర్ పార్టీ పెట్టిన రోజు మీడియా సపోర్ట్ లేదు.. సినీ గ్లామర్ లేదు… కేసీఆర్ ఓక మెదక్ జిల్లా నాయకుడు అంతే. చెన్నారెడ్డి నాయకత్వం లో 14 పార్లమెంట్ స్థానాలకు 11 స్థానాలు గెలిచినా తెలంగాణ రాలేదు. అలాంటి పరిస్థితులు ఉన్నా కేసీఆర్ మడమ తిప్పలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. 47ఏళ్ళ వయసులో కొత్త పార్టీ పెట్టుడు ఏంధుకు…తెలంగాణ ఉధ్యమం ఏంధుకు అని కేసీఆర్ ను  చిన్ననాటి స్నేహితులు వారించినా..కేసీఆర్ వినలేదు. ఒక్కరితో మొదలైన కేసీఆర్ ప్రస్తానం..ఓక ఉప్పెనెలా తయారయింది. రాజకీయ నాయకుల మీద అపనమ్మకం పోవాలంటే..పదవులు తృణపాయంగా వదిలి పెట్టారు. తన ఎమ్మెల్యే పదవికి ,డిప్యూటీ స్పీకర్ పదవి కి రాజీనామా చేసి ఉధ్యమం మొదలు పెట్టారు కేసీఆర్. ఉధ్యమంలో మడమ తిప్పితే..రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పే గుండె ధైర్యం ఎంత మందికి ఉంటుంది. 2004లో కాంగ్రెస్ తో  ,2009లో టీడీపీ తో పొత్తుపెట్టుకున్నా అది తెలంగాణ కోసమే. 1969,71లో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ ఉధ్యమం ను అనచివేసిందో..అదే పార్టీ ద్వారా తెలంగాణ సాధించిన చరిత్ర కేసీఆర్ ది. కేసీఆర్ నిరాహార దీక్ష తో మెడలు వంచి తెలంగాణ సాదించారు. టీ బీజేపీ ,టీ కాంగ్రెస్ ల ముందు టీ ఉందంటే అది కేసీఆర్ పెట్టిన బిక్ష. ఆంధ్రప్రదేశ్ లో గంజి ల ఈగల లెక్క తెలంగాణ లీడర్ల ను సూషెటోళ్ళు. కేసీఆర్ కాలి గోరు కు సరిపొనోళ్ళు ..కేసీఆర్ ను తిడతరు. నిన్న మొన్న పుట్టిన చిల్లర గాళ్ళు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారు. పేరు కే ఢిల్లీ పార్టీ లు…చేసేవి చిల్లర పనులు. 70 ఏళ్ళలో సాదించని ప్రగతి 7 సంవత్సరాలలో మేము సాదించాం.. తెలంగాణ సుభీక్షంగ ఉంటె..ప్రతిపక్షాలకు నచ్చట్లేదు. ప్రతిపక్షాల తీరుకు కుక్క కాటు కు చెప్పు దెబ్బ అన్నట్లు ఇక  ఉండాలి. ఇక ప్రతిపక్షాలు ఓక్కటి అంటే ..మనం పది అనాల్సిందే. మనం ఇక నోటి కి పనిచెప్పాల్సిన సమయం వచ్చింది.  పత్రిక లలో హెడ్ లైన్ ల కోసమే…ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. 60 లక్షల సభ్యత్వాలతో క్యాడర్ బేస్ గా టిఆర్ఎస్ ఏదిగింది. హుజూరాబాద్ ఓక చిన్న ఎన్నిక ఉంది.. అది లోకల్ లీడర్లు చూసుకుంటుంన్నారు. దగ్గర లో మరో ఎన్నిక లేదు కాబట్టి.. మన నేత ను తిడుతున్నారు. వాళ్ళందరికీ గట్టిగా సమాధానం చెప్పాలి. జీహెఎంసీ లో 4800 కాలనీలు ,1400 పైచిలుకు బస్తి ల కమిటీ లు వేసుకోవాలి. పార్టీ క్యాడర్ లో జోష్ ను నింపే లీడర్లను సిద్ధం చేస్తున్నాం. ఈ కమిటీ లలో ఓక లక్ష మంది సభ్యులు ఉంటారు.. అవసరం అయితే లక్ష మంది తో మీటింగ్ పెట్టుకునేలా ఉండాలి. జీహెఎంసీ మొత్తానికి ఓకే కమిటీ ఉండాలా..జిల్లా ల వారిగా కమిటీ లు ఉండాలా అనే దాని పై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

 

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

- Advertisement -

Tags:Name Delhi parties … Doing retail work-Minister KTR

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page