ఏ దేశ‌మైనా అభివృద్ధి చెందాలన్న ఆ దేశంలో నిష్పాక్షికంగా విద్య అవసరం-  ప్ర‌ధాన మంత్రి  నరేంద్ర‌ మోదీ

0 8,534

న్యూఢిల్లీ   ముచ్చట్లు
ఏ దేశ‌మైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో విద్య నిష్పాక్షికంగా, సంఘ‌టిత‌మైన‌దిగా ఉండాలని ప్ర‌ధాని నరేంద్ర‌మోదీ చెప్పారు. విద్య అనేది కేవ‌లం సంఘ‌టిత‌మైన‌దిగా ఉంటే స‌రిపోద‌ని, నిష్పాక్షిక‌మైన‌దిగా కూడా ఉండాల‌ని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. అందుకోస‌మే మ‌న దేశంలో టాకింగ్ బుక్స్‌, ఆడియో బుక్స్‌ను కూడా విద్య‌లో భాగం చేశామ‌ని ప్ర‌ధాని చెప్పారు. యూనివ‌ర్స‌ల్ డిజైన్ లెర్నింగ్ (యూడీఎల్‌)ను ఆధారంగా చేసుకుని దేశంలో ఇండియ‌న్ సైన్ లాంగ్వేజ్ డిక్ష‌న‌రీని రూపొందించార‌ని తెలిపారు.ఇండియ‌న్ సైన్ లాంగ్వేజ్‌ను పాఠ్యాంశాల్లో ఒక స‌బ్జెక్టుగా చేర్చ‌డం దేశంలోనే మొద‌టిసారి అని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ చెప్పారు. ఢిల్లీలో ఇవాళ శిక్ష‌క్ ప‌ర్వ్ కాంక్లేవ్ ప్రారంభం సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ ఐదు ఆవిష్క‌ర‌ణ‌ల‌ను లాంచ్ చేశారు. ఇండియ‌న్ సైన్ లాంగ్వేజ్ డిక్ష‌న‌రీ (చెవిటి విద్యార్థుల కోసం), టాకింగ్ బుక్స్ (అంధ విద్యార్థుల కోసం)ను ఆవిష్క‌రించారు. స్కూల్ క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వ‌ర్క్ ఆఫ్ సీబీఎస్ఈ ( CBSE), నిష్ఠ ( NISHTHA) టీచ‌ర్స్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ ఫ‌ర్ నిపుణ్ భార‌త్‌ను లాంచ్ చేశారు. విద్యాంజ‌లి పోర్ట‌ల్‌ను, స్కూల్ క్వాలిటీ అసెస్‌మెంట్ అండ్ అస్యూరెన్స్ ఫ్రేమ్ వ‌ర్క్ (SQAAF) ప్రారంభించారు.

 

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

- Advertisement -

Tags:Prime Minister Narendra Modi has said that education is needed impartially in any country that wants to develop

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page