పుంగనూరు ఫోటోగ్రాఫర్ , వీడియోగ్రాఫర్ల సంఘం నిరసన

0 9,811

పుంగనూరు ముచ్చట్లు:

 

30న అనంతపురం లోని ఎస్. ఆర్. గ్రాండ్ హోటల్లో ని పెళ్ళి వేడుక చిత్రీకరణ కోసం వెళ్లిన బాషా అనే ఫోటోగ్రాఫర్ మీద హోటల్ యాజమాన్యం విచక్షణా రహితంగా చేసిన దాడికి నిరసనగా గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల ఫోటో వీడియోగ్రాఫర్ల ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం పట్టణంలోని ఎస్. ఆర్. గ్రాండ్ హోటల్లో పెళ్లి కార్యక్రమానికి హాజరైన ఫొటో గ్రాఫర్ బాషా, లిఫ్ట్ లో పైకి వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న లిఫ్ట్ బాయ్ ఫోటోగ్రాఫర్ ను లిఫ్ట్ ఎక్కడాన్ని నిరాకరించారు. ఇది వివిఐపి లకు చెందిన లిఫ్ట్, మీ లాంటి లేబర్లకు కాదు అని దుర్బాషలాడుతూ అతని మీద దాడికి ప్రయత్నించగా స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదే సమయంలో అక్కడే ఉన్న రిసెప్షనిష్ట్ (మహిళ) నేరుగా వచ్చి ఫోటోగ్రాఫర్ మీద చెయ్యి చేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి కి వచ్చిన అతిధులు సర్ది చెప్పి, గోడవను సద్దుమణిగించారు. కానీ హోటల్ యాజమాన్యం పెళ్లి వేడుక అయిన తర్వాత బాషా (ఫోటోగ్రాఫర్)ను మాట్లాడాలని పిలిపించి,

 

 

 

 

- Advertisement -

దాదాపు 20 మందికి పైగా హోటల్ సిబ్బంది తో కలిసి కర్రలతో కొట్టి, పిడి గుద్దులు గుద్ది తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన అక్కడున్న సి సి కెమెరాలలో పూర్తిగా రికార్డ్ అవ్వడం, ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, పొరుగు రాష్ట్రాల ఫొటో వీడియోగ్రాఫర్ల సంఘాలు కూడా ఈ దుర్ఘటన ను తీవ్రంగా ఖండించి, గత నాలుగు రోజులుగా ధర్నాలు, రాస్తారోకో లు చేస్తున్నా కూడా హోటల్ యాజమాన్యం మీద ఇప్పుటి వరకూ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈ రోజు పుంగనూరు ఫోటో వీడియోగ్రాఫర్ల సంఘము ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సంఘటన మీద విచారణ పూర్తయ్యే వరకు హోటల్ ను సీజ్ చేసి, దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పుంగనూరు తహశీల్దార్ వెంకట్రాయలు గారికి పిర్యాదు చేసారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆ హోటల్ లో జరిగే ఏ ఈవెంట్ కు కూడా ఫొటో వీడియోగ్రాఫర్లు హాజరవ్వరని తెలియజేసారు. ఇప్పటికే దాదాపు 5 ఈవెంట్లకు ఫోటోగ్రఫర్లు వెళ్లకుండా, కార్యక్రమాలు రద్దు అయ్యాయని తెలియజేసారు. ఈ నిరసన కార్యక్రమంలో చంద్రశేఖర్, మురళి, బండి బాలు, ఉదయ్, అశోక్, కరుణాకర్, జగన్, రఘు, శేఖర్ , పుంగనూరు ఫోటో వీడియోగ్రాఫర్లు అధిక సంఖ్యలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు.

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

Tags: Punganur Photographers & Videographers Association protest

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page