నాన్ స్టాప్ గా వానలు,భయపడుతున్న జనాలు

0 8,455

హైదరాబాద్  ముచ్చట్లు:
తెలంగాణలో కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కుండపోత వర్షాలతో రోడ్లు చెరువుల్లా మారాయి. దీంతో జనాలు ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.  ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంతోపాటు ఉపరితల ద్రోణిగా మారడంతో.. రాష్ట్రమంతటా హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా 8 జిల్లాల్లో మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఆదివారం రాత్రి నుంచి పలు జిల్లాల్లో వర్షం కురుస్తూనే ఉంది. గ్రేటర్‌ పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు జిల్లాల్లో, హైదరాబాద్‌లో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. దీంతో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం రాష్ట్రంలోని 8 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అత్యవసరం అయితే త‌ప్పా ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్దంటూ సూచనలు చేశారు. బయట ఉన్నవారు కూడా త్వరగా ఇళ్లకు వెళ్లాలంటూ సూచించారు. సాయం కోసం టోల్‌ ఫ్రీ నెంబర్లను సైతం విడుదల చేశారు.సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా, కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఎక్కడ చూసినా నీరే కనిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా హనుమకొండ జిల్లా నడికుడ మండలంలో 38 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో రెడ్.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలోని వరద భయంకర వాతావరణం సృష్టిస్తోంది. మానేరు డ్యామ్ గేట్లు ఎత్తడంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జమ్మికుంట హౌసింగ్ బోర్డ్ కాలనీలో రెండు వందల ఇళ్లు జలదిగ్భంధంలో ఉన్నాయి
హైదరాబాద్‌ నగరంలో అత్యధికంగా శేర్‌లింగంపల్లి, గండిపేటలో 19.3 మిమీ వర్షపాతం నమోదు కాగా.. షేక్‌పేట, ఆసీఫ్‌నగర్‌లో 18.5 మీమి వర్షపాతం నమోదైంది. బహదూర్‌పూర, అల్వాల్‌, కుత్బుల్లాపూర్‌, కాప్ర, నాంపల్లి, ఉప్పల్‌, మారేడ్‌పల్లి, బాలనగర్‌, రాజేంద్రనగర్‌ ప్రాంతాలో 10 మీమి కి పైగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

 

- Advertisement -

Tags:Rains non-stop, frightened people

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page