తాడోబా అభయారణ్యం లో సచిన్ పర్యటన

0 7,862

పులుల సందర్శనకు వచ్చిన సచిన్ దంపతులు
మూడు రోజులుగా తాడోబా అభయారణ్యం లో సచిన్ బస
అదిలాబాద్  ముచ్చట్లు:
మహారాష్ట్ర లోని  చంద్రపూర్  జిల్లా తాడోబా అభయారణ్యంలో సచిన్ టెండూల్కర్ కుటుంబ సభ్యులు మిత్రులతో కలిసి పర్యటించారు. ఈ నెల 4 న భార్య అంజలి, సచిన్ సోదరి, మరో మాజీ క్రికెటర్ ప్రశాంత్ వైద్య ఇతర మిత్రులతో కలిసి వచ్చిన సచిన్ ఇక్కడి రిసార్ట్స్ లో  బస చేశారు… అంతకముందు కూడా సచిన్ టెండుల్కర్  రెండుసార్లు తాడోబా  అభయారణ్యం ను సందర్శించాడు… తొలిసారిగా 2020 జనవరి 26 న  భార్య అంజలి కుమారుడు అర్జున్ తో కలిసి రాగ , ఈ ఏడాది జనవరి 26 న తన తల్లి మిత్రులతో కలిసి  వచ్చాడు. తాడోబా అభ్యరణ్యం లో  పర్యటనకు వచ్చిన సచిన్ దంపతుల వెంట అటవీశాఖ అధికారులు  ఉన్నారు. సచిన్ తాడోబా పులుల అభిమాని అని అధికారులు తెలిపారు…

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

- Advertisement -

Tags:Sachin visits Tadoba Sanctuary

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page