డీజీపీకి చంద్రబాబు లేఖ

0 8,461

అమరావతి ముచ్చట్లు:

డీజీపీ గౌతమ్ సవాంగ్ కు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాసారు.  ప్రకాశం జిల్లా లింగసముద్రం పోలీసులు వైసీపీ నేతల ఆదేశాలతో మొగిలిచర్లకు చెందిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలను స్టేషన్ కు పిలిపించి వేధిస్తున్నారు.  పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో  6, 10 ఏళ్ల చిన్నారులు కూడా ఉన్నారు.  పి.రత్తయ్య, ఎం.శ్రీకాంత్ అనే కార్యకర్తలను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు.   టీడీపీని వీడాలని చిత్రహింసలకు గురిచేసి  అర్థరాత్రి 2 గంటలకు వదలిపెట్టారు.  ఉదయాన్నే మళ్లీ 6.30 గంటలకు లింగసముద్రం ఎస్ఐ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కు రావాలని బెదిరించారు.   పోలీసుల బెదిరింపులు తట్టుకోలేక రత్తయ్య, శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని లేఖలో రాసారు.  ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తర్వాత మిగిలిన వారిని హడావుడిగా స్టేషన్ నుండి పంపించారు.  ఎఫ్ఐఆర్  కాపీ కూడా ఇవ్వలేదు.  ఈసంఘటనతో రాష్ట్రంలో పోలీసుల వేధింపులు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది.  రాష్ట్రంలోని కొంతమంది పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు.   వైసీపీ నేతల రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులు పనిచేస్తున్నారు. రెండేళ్లలో పోలీసుల బెదిరింపులు తారాస్థాయికి చేరుకున్నాయి.    పోలీసులపై ప్రజలు పట్టుకున్న విశ్వాసం అగాధంలోకి వెల్లింది.   రాష్ట్రంలో పోలీస్ ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోంది.   చట్టానికి లోబడి పోలీసులు విధులు నిర్వహించాలి.  లింగసముద్రం ఘటనపై తక్షణమే విచారణజరిపి చర్యలు తీసుకోవాలి.   పక్షపాతం లేకుండా పోలీసులు విధులు నిర్వహించేలా ఆధేశించాలని లేఖలో పేర్కోన్నారు..

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Chandrababu’s letter to the DGP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page