చవితి వేడుకలకు అనుమతినివ్వాలి -జనసేన

0 15

దర్శి ముచ్చట్లు:
హిందువుల మనోభావాలను గౌరవించి, తమ నిర్ణయమును పునస్సమీక్షించి,    వినాయకచవితి పర్వదిన సాంప్రదాయ వేడుకలకు అనుమతి మంజూరు చేయవలసిందిగా కోరుతూ బుధవారం దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ తరపున ఒక వినతి పత్రమును దర్శి మండల డిప్యూటీ తహసీల్దార్ కి సమర్పించారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే  విజయ గణేష్ స్వామి వారి వేడుకలు చేసుకోవచ్చునని, హిందువులకు మరీ ముఖ్యంగా విద్యార్థులకు శ్రీ వినాయకచవితి పండుగ చాలా విశిష్టమైనది కనుక వేడుకలకు అనుమతి ఇచ్చి హిందువుల మనోభావాలను గౌరవించవలసిందిగా ప్రభుత్వానికి సూచించారు.  ఈ కార్యక్రమములో జనసైనికులు సర్వశ్రీ పసుపులేటి చిరంజీవి,  పుప్పాల పాపారావు,  మాదా వెంకట శేషయ్య, చాతరాసి కొండలు, షేక్ ఇర్షాద్,  జడల వెంకట్, పుప్పాల రుద్ర, ఉప్పు ఆంజనేయులు,  తోట వెంకీ, పార్సెపు హనుమంతరావు, ఈర్ల కొండలు, అబ్దు అఖిల్,  చలువాది శివ,  పసుపులేటి సాయి, సానే గుర్నాథం,  మరెడ్డి పవన్ , ఆవుల కొండలు,  అంచుల వీరాంజనేయులు, పి. నాగేశ్వర రావు, బి. పవన్ కళ్యాణ్  తదితరులు పాల్గొన్నారు.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

- Advertisement -

Tags:Chaviti ceremonies should be allowed -Janasena

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page