ముగిసిన హనుమాన్ టెంపుల్ వివాదం

0 8,416

హైదరాబాద్  ముచ్చట్లు
ఫిల్మ్ నగర్ లో హనుమాన్ టెంపుల్ విగ్రహం తొలగింపు వివాదం ముగిసింది. అక్కడి ప్రైవేట్ కంపెనీ హనుమాన్ టెంపుల్ కట్టివ్వడానికి ముందుకు వచ్చింది. ఈ నేపధ్యంలో కింద ఉన్న బాల హనుమాన్ టెంపుల్ లో స్వామిజీలు, భజరంగ్, ఆర్ఎస్ ఎస్ , విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేసారు. శివ స్వామిజీ మాట్లాడుతూ ఇది హిందువుల విజయమని అన్నారు. మొన్న కొందరు దుండగులు కొండపైన ఉన్న విగ్రహాన్ని తొలగించి కింద పెట్టారు. దీన్ని నిరసిస్తూ ఆమరణ నిరాహారదీక్ష చేశామని అన్నారు.ప్రైవేట్ కంపెనీ మాతో చర్చలు జరిపింది. రాత పూర్వకంగా 2000 వేల గజల్లో హానుమాన్ విగ్రహం తొలగించిన దగ్గర హనుమాన్ టెంపుల్, ధ్వజస్వంభం, మండపం,40 ఫీట్ల రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం హిందు దేవాలయలను కూల్చి వేసే ప్రయత్నం చేస్తున్నారు. హిందువుల దేవాలయల జోలికి వస్తే మా హిందువులు ఒక్కటి అయి పోరాటం చేస్తామని అన్నారు.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

- Advertisement -

Tags:End Hanuman Temple Controversy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page