రూ.1500 కోట్ల విలువైన ఫిల్మ్ నగర్ భూములు అడ్డగోలుగా అప్పలం

0 8,654

– ఇందులో కేసీఆర్ కు వాటా ఎంత ?:దాసోజు
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని డిమాండ్

- Advertisement -

హైదరాబాద్ ముచ్చట్లు:

కంచె చేను మేసినట్టుగా అధికార పార్టీ నాయకులు విలువైన భూములు అడ్డగోలుగా తీసుకున్నారని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.వీటిని  ఎంపీ రంజిత్ రెడ్డి, ఇందు శ్యామ్ ప్రసాద్ రెడ్డి లకు ప్రభుత్వం విలువైన భూములను కట్టబెట్టిందని తెలిపారు. బుదవారం గాంధీ భవన్ లో  మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఇందులో కేసీఆర్ కు వాటా ఎంత ? అని ప్రశ్నించారు.17 ఎకరాల భూమిని అప్పనంగా అప్పగించారు.తెలంగాణ కు వ్యతిరేకంగా ఉన్నాడని బద్నాం చేసిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భూములను కాపాడారు. కేసీఆర్ తెలంగాణ భూములను దోపిదార్లకు అప్పగించారు. అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి దేవపాయాన్ని కూడా తొలగించి భూములను స్వాధీనం చేసుకున్నారు.ఇక్కడ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన నియోజక వర్గంలో ఉన్న ఈ భూముల గురించి మాట్లాడుతారా.. గతంలో ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి పని చేసారు. బీజేపీ వాళ్ళు ఆంజనేయ గుడిని ఎందుకు కాపాడేందుకు పోరాటం చేయడం లేదు..ఈ విషయంలో ముఖ్యమంత్రి కి లేఖ రాసాము. సంబంధిత అధికారులకు, హోసింగ్ బోర్డ్ కు లేఖలు రాసాము.ఈ విషయంలో ఎంత దూరం అయిన పోతాం. తెలంగాణ భూములు కాపాడుకుంటాం. ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కాపాడుకుంటాం మన్నారు.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Film Nagar lands worth Rs 1,500 crore are lying horizontally

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page