సాయి చైతన్య స్కూల్లో ఫిట్ ఇండియా ఫ్రీడం రన్2.0.

0 8,461

నెల్లూరు  ముచ్చట్లు:
భారత ప్రభుత్వము , యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ  యువ కేంద్ర, నెల్లూరు ఆధ్వర్యంలో రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో  బుధవారం డైకస్ రోడ్డు సెంటర్ లోని సాయి చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు  ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 నిర్వహించారు.  ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవటం. దీనికోసం ప్రతి వ్యక్తి కనీసం అరగంట వ్యాయామం లేదా ఆటలు ఆడటం, తద్వారా మన యొక్క శారీరిక, మానసిక రుగ్మతలు నయం చేసుకోవటం, రోజువారీ జీవితంలో రన్నింగ్ మరియు స్పోర్ట్స్ వంటి ఫిట్‌నెస్ కార్యకలాపాలను చేపట్టడానికి ప్రజలను ప్రోత్సహించడానికి, స్థూలకాయం, సోమరితనం, ఒత్తిడి, ఆందోళన, వ్యాధులు మొదలైన వాటి నుండి స్వేచ్ఛ పొందడానికి ఫిట్‌నెస్‌ని ఒక జీవన విధానంగా ప్రాచుర్యం పొందడం మరియు ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించేలా చేయడం కోసం నిర్వహించబడినది. ఈ కార్యక్రమములో 100 మంది ఫ్రీడమ్ రన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సెట్నెల్ సీఈఓ డి. పుల్లయ్య, నెహ్రూ యువకేంద్ర యూత్ కో.ఆర్డినేటర్ డా.ఎ. మహేందర్ రెడ్డి,ఎపియుడబ్ల్యుజె రాష్ట్ర కార్యదర్శి ఎ. జయప్రకాష్, రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు షేక్ రసూల్, జిల్లా పీఎంపీ అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్, జి.శేషయ్య, పాటశాల కరస్పాండెంట్ కె.హారనాధ్,  వసుజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ జె.వసుందర,నిత్య వాణి ఫౌండేషన్ మోహన్,సందన కాశిం, రాజేష్,నారాయణ,మన్సూర్ పాల్గొన్నారు.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

- Advertisement -

Tags:Fit India Freedom Run 2.0 at Sai Chaitanya School.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page