వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోమయ మట్టి వినాయకుల ఉచిత పంపిణీ

0 8,754

మందమర్రి ముచ్చట్లు:

వినాయక చవితి వస్తుందంటే రంగు రంగుల గణపతుల విగ్రహాలను తీసుకువస్తుంటారు. గతంలో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌, కృత్రిమ రంగులతో చేసిన వినాయకుడి విగ్రహాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేవారు. ప‌ర్యావ‌ర‌ణంపై ప్ర‌త్యేకంగా జల కాలుష్యంపై ప్రజలకు అవగాహన పెరగడంతో క్రమంగా మట్టి గణపతి ప్రతిమలను ప్ర‌తిష్టించేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు.వెలుగు ఫౌండేషన్ వారు మరో అడుగు ముందుకేసి ఆవు పేడతో చేసిన అందమైన వినాయకుడి విగ్రహాలను ఇళ్లలో, పూజా మండపాల్లో ప్ర‌తిష్టిస్తున్నారు. అయితే ప‌ర్యావ‌ర‌ణ పరిరక్షించేందుకు బంక మట్టి గోమయంతో గణపతులను తయారు చేస్తూ వీరు  గ‌త కొన్నేళ్ళుగా ఉచితంగానే మట్టి గ‌ణ‌ప‌తి విగ్ర‌హాల‌ను పంపిణీ చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడటంలో గోవు ఎంతో ఉపయోగపడుతుందని వెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మడుపు రామ్ ప్రకాష్ తెలిపారు. శాస్త్రీయంగా గోవు పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రం అన్ని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. అదే ఆలోచనతో  బంక మట్టి గోమయంతో గణపతులను తయారు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. పురాతన ప్రక్రియను అనుసరించి ఆవుపేడతో రకరకాల సైజుల్లో వినాయకుడి అందమైన విగ్రహాలను తయారు చేసి  ఉచితంగానే భ‌క్తుల‌కు అంద‌జేస్తున్నామ‌ని తెలిపారు. కళాకారులు ఎంతో శ్రమించి గోమయ గణేశ విగ్రహాల‌ను రూపొందిస్తున్నార‌న్నారని ఇవి పూర్తిగా పర్యావరణహితమైనవి కావ‌డంతో భ‌క్తులు గోమ‌య గ‌ణ‌ప‌య్య‌ను ప్ర‌తిష్టించ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నార‌న్నారని అన్నారు.కోవిడ్ ప్ర‌త్యేక ప‌రిస్థితుల నేప‌థ్యంలో గ‌త ఏడాది గోమ‌య గ‌ణేష్ విగ్ర‌హాల‌ను పంపిణీ చేయ‌లేద‌ని,  బంకమట్టి తో తయారు చేసి మాత్రమే అందించామని ఈ ఏడాది మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గంలో  బంక మట్టి గోమ‌య వినాయ‌క విగ్ర‌హాల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు మడుపు రామ్ ప్రకాష్ తెలిపారు.

 

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Free distribution of Gomaya clay ginseng under the auspices of Velugu Foundation

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page