గ్రంధాలయ భవనానికి మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన

0 4,878

యదాద్రి భువనగిరి  ముచ్చట్లు:

గ్రంథాలయ ఉద్యమం మొదలైంది భోనగిరి సభలనుండినని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.అంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ నేల మీద రెండు కోట్ల అంచనా వ్యయంతో నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మించుకోవడం అభినందనియామని ఆయన కొనియాడారు. భోనగిరియాదాద్రి జిల్లా కేంద్రంలో రెండుకోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన నూతన గ్రంధలయ భవన నిర్మాణానికి ఆయన శంఖుస్థాపన చేశారు.అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రాపంచిక పరిజ్ఞానం పెంచేది గ్రంధాలయాలేనన్నారు.విద్యార్థి యువతకు విద్యా బోధన తో పాటు పఠనాశక్తిని పెంపొందించెందుకు గ్రంధాలయలు దోహదపడుతాయన్నారు.ఒక్కమాటలో చెప్పాలి అంటే గ్రంధాలయలు మేధావులను సృష్టించే కర్మాగారాలు అని ఆయన అన్నారు. యింకా ఈ కార్యక్రమంలోప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,జడ్ పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,స్థానిక శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి, రాష్ట్ర గ్రంధాలయసంస్థ అధ్యక్షుడు ఆయాచితం శ్రీధర్,జిల్లా అధ్యక్షుడు అమరెందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Minister Jagadish Reddy laid the foundation stone for the library building

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page