రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు వినతి పత్రం

0 8,461

మేడ్చల్ ముచ్చట్లు:

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సంస్థ నుండి రావాల్సిన బకాయిలను వీలైనంత త్వరలో చెల్లిస్తామని ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ హామీ ఇచ్చినట్టు రిటైర్డ్ ఆర్టిసి ఎంప్లాయిస్ సీనియర్స్ సిటిజన్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మాయ వంజరి కృష్ణ తెలిపారు. బుధవారం ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ సీనియర్ సిటిజన్ ఫోరం తెలంగాణ ఆధ్వర్యంలో సజ్జనార్ ను కలిసి  సమస్యలపై వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ సకల జనుల సమ్మెలో బకాయిలు,లీవు ఎన్కాష్మెంట్ బకాయిలు,యస్.ఆర్.బి.యస్.,బకాయిలు  వంటి అనేక సమస్యలపై చర్చించడం జరిగిందని దానికి సానుకూల  సజ్జనార్ సానుకూలంగా స్పందించారని  వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ సీనియర్స్ సిటిజన్ ఫోరం తెలంగాణ గౌరవ అధ్యక్షుడు సుధాకర్,రాష్ట్రప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు,రాష్ట్ర కోశాధికారి ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Petition to RTC MD Sajjanar on issues of retired RTC employees

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page