అంతర్ రాష్ట్ర దొంగల ముఠా ప్రాధాన నిందితుడు అరెస్ట్

0 8,758

మందమర్రి పోలీస్ లను అభినందించిన ఏసిపి రెహమాన్

మందమర్రి ముచ్చట్లు:

- Advertisement -

పరారిలో ఉన్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠా ప్రాధాన నిందితున్ని మందమర్రి పోలీసులు పట్టుకున్నారు.నిందితుని వద్దనుండి 2.5లక్షల రూపాయలను,45 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.బుధవారం ఇదే విషయమై మందమర్రి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బెల్లంపల్లి ఏసీపి రెహమాన్ వివారాలు వెల్లడించారు.ఛత్తీస్ఘడ్, జగ్దల్పూర్ కు చెందిన సూరజ్ శ్రీరామ్ శెట్టి అతని భార్య సత్యవతి, తమ్ముడు రాహుల్ సూరజ్ లు జల్సాలకు అలవాటుపడి  అక్కడి నుండి మంచిర్యాల కు వచ్చి నివాసం ఉంటూ మంచిర్యాల,గద్దెరాగడి, శ్రీ శ్రీ నగర్,నివాసం ఉన్న ప్రాంతాల్లో పగలు ఆటో నడుపుతూ రాత్రిళ్ళు ముగ్గురూ కలిసి రామక్రిష్ణపూర్, మందమర్రి,కాశీపేట, మంచిర్యాల ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇండ్లను ఎంచుకుని చోరీలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఇలా దోచుకుంటున్న సొమ్మును వారికి వీలుచూసుకొని అమ్మి సొమ్మచేసుకుని జల్సా చేసేవారని చెప్పారు.వీరిపై చంద్రపూర్, నాగపూర్ లో కేసులు ఉన్నాయని తెలిపారు. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలు ముగ్గురిలో ఇద్దరిని మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 34లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభ రణాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా అట్టి నిందితుడు నాగపూర్ నుండి మంచెరియల్ కి  వచ్చి అక్కడి నుంచి బెల్లంపల్లి కి ఆటొ లో వెళ్తుండగ ఉరుమందమర్రి కూడలి రోడ్డు వద్ద పోలీసు లు వాహన తనిఖి చేస్తున్నా సమయంలో అది చూసి నిందితుడు ఆటొ దిగి పారిపోతుండగా, పోలీసులు పట్టుకొని విచారించగా తను
సూరజ్ శ్రీరామ్ శెట్టి అని ఆటొ డ్రైవరు, బలికుంట, జగదల్పూర్, చత్తీస్గఢ్ రాష్త్రం. అని తెలిపాడని.అతని  వద్ద ఉన్న దొంగిలించిన బంగారు ఆభరణాలు బ్యాగ్  లో నుండి బయటకు తీసి బంగారు ఆభరణాలను మాకు చూపించినాడని తెలిపారు. అందులో 1-బంగారు చైను,కొంత ముద్ద బంగారం, 2-బంగారు ప్రతానపు ఉంగరాలూ ఉన్నాయని అన్నారు.వీరు  2019 సెప్టెంబర్ నుంచి రామకృష్ణాపూర్ పీఎస్ పరిధిలో 8 మందమర్రి పరిధిలో 5. కాశీపేట పీఎస్ పరిధిలో 2, మంచిర్యాల లో ఒక చోరీ కేసులో నిందితులు.ఈ సందర్భంగా ఏసిపి రెహమాన్ నిందితులను పట్టుకున్న పోలీస్ లను అభినందించారు. ఈ సమావేశంలో సిఐ ప్రమోద్ రావు, ఎస్ఐ భూమేష్, రామక్రిష్ణ పూర్ ఎస్ ఐ సంజీవ్, ట్రైనీ ఎస్ఐ రమేష్, కానిస్టేబుల్స్ బాలక్రిష్ణ, అజయ్,జంగు, పాల్గొన్నారు.

 

Tags:The main accused in the inter-state gang of thieves has been arrested

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page