మంత్రి పువ్వాడ కు శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ నేతలు

0 7,847

ఖమ్మం ముచ్చట్లు:

తెలంగాణ  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  పదవీకాలం రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు ముత్యాల వెంకటప్పారావు బుధవారం మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి ని కలిసిన ఆయన  రవాణా శాఖ మంత్రిగా క్లిష్టమైన సమస్యలను సైతం ఎదుర్కొని శాఖ పనితీరు కు వన్నె తెచ్చారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు అందుకుంటున్నారని వెంకటప్పారావు కొనియాడారు. మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో వైరా ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఎంపీపీ మాలోతు శకుంతల, జడ్పిటిసి వాంకుడోత్ జగన్, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సంత చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు తోటకూరి రాంబాబు, అజ్మీర వీరన్న తదితరులు ఉన్నారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:TRS leaders congratulate Minister Puvada

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page