వినాయక చవితిని ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి

0 8,477

– గణపతి నవరాత్రోత్సవాలకు ఆన్లైన్ దరఖాస్తు తప్పనిసరి

– గోదావరిఖని ఏసీపీ ఉమెందర్

- Advertisement -

పెద్దపల్లి ముచ్చట్లు:

వినాయక చవితిని పట్టణ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని గోదావరిఖని ఏసీపీ ఉమెందర్ సూచించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి సంభందించిన గణేష్ మండపాల నిర్వహకులకు, ప్రజా ప్రతినిధులకు, కార్పొరేటర్లకు 1టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఏసీపీ ఉమెందర్, సీఐలు రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. గణపతి విగ్రహాల ఏర్పాటు కోసం పోలీస్ ల అనుమతి కోసం ఆన్లైన్ ద్వారా http://
policeportal.tspolice.gov.in/index.htm లింకు ద్వారా ధరఖాస్తు చేసుకోవాలని అన్నారు. మండపాలు ఎక్కడ నిర్వహిస్తున్నారు.. విగ్రహం సైజు తెలుపాలని పేర్కొన్నారు. ముఖ్యంగా  మండపాల వద్ద సీసీ కెమెరాలతోపాటు, ప్రతీ మండపానికి ఒక ఇన్చార్జిని నియమించాలని తెలిపారు. విద్యుత్ శాఖ అనుమతి, అగ్నిమాపక శాఖ అధికారుల అనుమతి, మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. మార్గదర్శకాలను తప్పక పాటించాలని, ఆన్లైన్ ద్వారా అనుపతి పత్రాలు పొందాలన్నారు. డీజేలకు అనుమతి ఎట్టిపరిస్థితుల్లో ఉండదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిం చేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గణేష్ నవరత్రుల సందర్భంగా పలు సూచనలు చేశారు. గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రతి గణేష్ మండలి వారు విధిగా పోలీస్ శాఖ నుండి ముందుగా ఆన్ లైన్ లో లింక్ http:// policeportal.tspolice.gov.in/index.htm ద్వారా దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవలను. అనుమతి కొరకు దరఖాస్తు చేయునపుడు, విగ్రహం ఎత్తు, విగ్రహాన్ని ప్రతిష్టించే తేది, నిమజ్జనం తేది, మండలి యొక్క ప్రెసిడెంట్, వైస్ ప్రసిడెంట్ ల వివరాలు సమర్పించాలని, విగ్రహము ప్రతిష్టించే స్థలము ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించ కూడదు. ప్రైవేటు స్థలం అయితే స్థల యజమాని యొక్క అనుమతి పొందాలని, గణేశ్ మండలి వద్ద ఎల్ల వేళలా ఒకరు మండలి తరపున హాజరుగా ఉండి వ్యవహారాలు చూసుకో వలెను. బందోబస్తు విధులలో గల పోలిస్ వారికి సహకరించ వలెనని, ప్రతి మండలి వద్ద ఒక రిజిస్టరు ఉంచి అందులో ఆ రోజు మండలి తరపున నియమించిన వ్యక్తి యొక్క సంతకం కలిగి ఉండ వలెనని, గణేష్ మండలి వద్ద సి.సి.టి.వి., తప్పనిసరిగా బిగించాలని, గణేష్ మండలి వద్ద ఒక బాక్సు టైప్ మైకు మాత్రమే (అనుమతి గలది) వినియోగించాలన్నారు. గణేష్ మండలి వద్ద గానీ, నిమజ్జనం సమయములలో గానీ డి.జె., వాడటం నిషిద్ధమని, గణేష్ నిమజ్జనం రోజు పోలిస్ వారికి సహకరించి నిర్ణీత వ్యవధిలో నిబంధనలకు లోబడి నిమజ్జనం పూర్తి చేయాలని, గణేష్ నవరాత్రుల సమయములో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినచో మీ దగ్గరలోని పోలిస్ స్టేషన్ కు గానీ 100 డయల్ కు తెలిజేయలని సూచించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా, నిభంధనలు అతిక్రమించినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిమజ్జనం రోజున గణేషులను ఉదయం 10 గంటల నుండి గోదావరి నదికి తీసుకువెళ్లేలా కమిటీ సబ్యులు చూసుకోవాలని, పట్టణంలో వందల సంఖ్యలో విగ్రహాలు ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండ నిమజ్జనంలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, మండప నిర్వాహకులు, కార్పొరేటర్లు, వీహెచ్ పీ, భజరంగ్ దళ్ సభ్యులు పాల్గొన్నారు.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Vinayaka Chavati should be celebrated in a peaceful atmosphere

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page